ఆ ముగ్గురి స్టార్లను కలుపుతున్నది ఏమిటి?

Pawan Mahesh NTR to meet Together

11:19 AM ON 22nd February, 2016 By Mirchi Vilas

Pawan Mahesh NTR to meet Together

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒకేచోట కలవబోతున్నారు. వీరి ముగ్గురూ కలిసేది ఏదో కార్యక్రమం కోసమో లేక ఒకే సినిమా కోసమో కాదు. వీరు నటిస్తున్న సినిమాలు షూటింగ్‌ ఒకేచోట జరగనున్నాయి. పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుండగా, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించబోయే 'జనతా గ్యారేజ్‌' చిత్రం షూటింగ్‌ ఈ రోజు ( ఫిబ్రవరి 22 ) నుండి ప్రారంభం కానుంది. ఇక మహేష్‌ నటిస్తున్న 'బ్రహ్మూెత్సం' చిత్రం షూటింగ్‌ రేపటి నుండి ప్రారంభం కానుంది. ఒకేసారి ఈ ముగ్గురు స్టార్‌ హీరోలు సినిమాలు షూటింగ్‌ ఒకేచోట జరగనుండడంతో ఈ ముగ్గురూ ఇప్పుడైనా కలుస్తారా అని అభిమానులు, సినీరంగ ప్రముఖులు అనుకుంటున్నారు.

English summary

Tollywood Star Heros Pawan Kalyan,Mahesh Bau,NTR were busy with their upcoming movies shooting.Pawan's Sardar and Mahesh Babu Brahmotsavam and NTR's Janata Garage movies shooting were going on Ramoji film city in Hyderabad.Fans were waiting for the moment to see these three heroes to meet together.