సర్దార్ తల్లి అలాఅనేసారేంటి?

Pawan mother Anjana Devi at Sardar premiere show

11:26 AM ON 9th April, 2016 By Mirchi Vilas

Pawan mother Anjana Devi at Sardar premiere show

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఉగాది నాడు విడుదలై, ఫాన్స్ కు పండగ వాతావరణం తెచ్చింది. గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెల్లవారుజాము నుంచే షోలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఫ్యాన్స్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటుంటే, మరికొందరు విశ్లేషకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇక అభిమానులతో కలిసి ఈ సినిమా వీక్షించిన పవన్ తల్లి అంజనా దేవి ఈ సినిమా పై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'బావుంది, కళ్యాణ్ బాగా చేసాడు' అంటూ ఆమె ఆనందంతో చెప్పారు.

పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దర్శకుడు బాబీ, నిర్మాత శరత్ మరార్, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తదితరులు కూడా సినిమా వీక్షించి, పవన్ నటన అదరహో అంటున్నారు.

English summary

Pawan mother Anjana Devi at Sardar premiere show. Pawan Kalyan mother Anjana Devi responds about Sardar Gabbar Singh movie.