కొద్ది రోజులు రాజకీయాలకి దూరంగా ఉంటా!

Pawan said that i am out of politics

10:53 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Pawan said that i am out of politics

అతి తక్కువ సినిమాలతో అంతు లేనంత క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. పవన్‌ ని తన సినిమాలకంటే తన వ్యక్తిత్వాన్ని చూసే ఎక్కువ ఇష్టపడే వాళ్లు ఉన్నారు. కోట్లు ఆస్తి ఉన్నా సింప్లిసిటీకి మారు పేరుగా నిలుస్తారు అందుకే అతనికి అంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌. అయితే పవన్‌ ప్రజలకు మంచి చేద్దామనే ఉద్ధేశ్యంతో 'జనసేన' అనే రాజకీయ పార్టీ స్థాపించారు. పదవుల పై ఆసక్తి కోసం కాదు ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించడం కోసమే అని పార్టీ పెట్టారు. అయితే పవన్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుట్నుంచి సినిమా ల పై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు.

సరిగ్గా సినిమాలు రాక పవన్‌ అభిమానులు కూడా ఎంతో నిరుత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దీని పై పవన్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక పై రాజకీయాలని పక్కన పెట్టి సినిమాల పైనే దృష్టి పెడతానని ప్రకటించారు. తను ప్రస్తుతం నటిస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం అనుకున్న సమయంలోనే రిలీజ్‌ చేస్తామని చెప్పారు. అంతే కాదు ఇంకో రెండు సినిమాలకి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి, త్వరలోనే వాటిని ప్రకటిస్తామని చెప్పారు. పవన్‌ అభిమానులకి నిజంగా ఇది పండగే అని చెప్పాలి. కానీ పవన్ మాత్రం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడోనని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. కాపు గర్జన విషయంపై పవన్ ప్రెస్‌మీట్ పై జనం నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు పవన్ సమస్యపై చాలా స్పష్టంగా మాట్లాడాడని, కొంత మంది మాత్రం సమస్యపై ఏ మాత్రం అవగాహన లేకుండానే ఏదో నామమాత్రంగా ప్రెస్ మీట్‌ను కానిచ్చేసాడని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసాయి. కొంత మంది మాత్రం పవన్ అభిమానుల పేరిట పవన్ ఫ్లెక్సీలను తగుల బెట్టిన ఘటనలు కొంచెం ఆందోళన కలిగించాయి. దీంతో పవన్ తన ఆలోచనను మార్చుకుని సరైన నిర్ణయం తీసుకునేందుకు మరి కొంత సమయం వెచ్చించే దిశగా కదులుతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.

English summary

Power Star Pawan Kalyan said that i am out of politics. And i will concentrate on only movies.