ఎన్టీఆర్-చిరూల పై పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan shocking comments on Chiranjeevi and Ntr

10:51 AM ON 6th April, 2016 By Mirchi Vilas

Pawan shocking comments on Chiranjeevi and Ntr

ఒక్కోసారి నిజాలు మనస్సులోంచి బయటకు వచ్చేస్తాయి... మరికొన్ని సార్లు హృదయంలో లేకపోయినా పైకి అనేస్తారు... అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఉన్నది ఉన్నట్టు అనేయడానికి ఏ మాత్రం సంకోచించడు. ఎవరి కోసమో పొగుడుతూ మాట్లాడాడు. అలాగని ఏదో విమర్శించాలని విమర్శలు చేయడు. ఆచి తూచి మాట్లాడడం, రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయడం అస్సలు పనికిరాదు. తాజాగా 'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీని హిందీలో కూడా రిలీజ్ చేస్తుండడంతో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడి మీడియాకి స్పెషల్ ఇంటర్‌వ్యూ లు ఇస్తున్నాడు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి ప్రత్యేకంగా ఫేస్ టు ఫేస్ లు కొనసాగుతున్నాయి మీడియా ప్రతినిధులు.

ఇది కూడా చదవండి: పవన్ వాడిన బైక్ కోసం 8 లక్షలు ఖర్చు పెట్టిన సూపర్ స్టార్

అప్పట్లో అనుపమకు ఇంటర్‌వ్యూ ఇచ్చిన పవన్.. రీసెంట్ ఇంటర్‌వ్యూ లో మరిన్ని కొత్త సంగతులు చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు తాను సూపర్ ఫ్యాన్ అని చెప్పిన పవన్.. సర్దార్ ను స్టోరీ ప్రకారమే హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పాడు. తనకు స్టార్ డం మీద మమకారం, ఇష్టం లేవని వివరించాడు. అయితే.. తన యాక్టింగ్ తో ఎవరికీ అందని స్థాయిలో ఉండడం పై స్పందన అడిగితే మాత్రం.. ఈ విషయంలో ఎన్టీఆర్ కి(పెద్ద ఎన్టీఆర్) సాటి ఎవరూ రాలేరని.. ఆయన లాంటి నటుడు ఉండరని పవన్ అన్నాడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసాడు.

ఇది కూడా చదవండి: నన్ను సీఎం లైంగికంగా వాడుకున్నారు

అయితే పాటల్లో నటించడానికి-డ్యాన్సులు చేయడంలోనూ ఇబ్బంది పడతానని చెప్పేసిన పవన్ కళ్యాణ్. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తాను వీరాభిమానినని స్పష్టం చేసాడు. క్రేజ్ విషయంలో చిరును అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదన్నాడు. ఎన్టీఆర్ యాక్టింగ్ కి సాటి... చిరంజీవి క్రేజ్ కి పోటీ ఎవరూ ఉండరని, ఉండబోరని పవన్ సూటిగా చెప్పేసాడు.

English summary

Pawan shocking comments on Chiranjeevi and Ntr. Pawam Kalyan Shocking comments on senior Ntr and Chiranjeevi.