పవన్ నా కాళ్ళకి దన్నం పెట్టుకున్నారు

Pawan Touched My Legs Says Sudigali Sudheer

12:28 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Pawan Touched My Legs Says Sudigali Sudheer

ఎంతో మంది నటుల్ని ప్రోత్సహించి, తమకి అన్నం పెట్టిన కామెడీ షో 'జబర్ధస్త్‌'. ఈ కామెడీ షోతోనే షకలక శంరక్‌, ధనరాజ్‌, చలాకి చంటి, సుడిగాలి సుధీర్‌ లాంటి వాళ్ళకి సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే షకలక శంకర్‌, ధన్‌రాజ్‌ కి వచ్చినన్ని అవకాశాలు సుడిగాలి సుధీర్‌కి రాలేదు. కానీ తాజాగా సుధీర్‌కి కూడా ' సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ 'లో నటించే అవకాశం వచ్చింది. ఈ మధ్య సుధీర్‌ ఒక టీవీ షోకి అతిధిగా వెళ్ళాడు. అక్కడ ఒక షాకింగ్‌ న్యూస్‌ ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదేంటంటే పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ గారు ఎప్పుడూ చాలా సింపుల్‌గా ఉంటారు. తమ కో-స్టార్స్‌తో ఎప్పుడూ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో పవన్‌కళ్యాణ్‌ గారి కాలు అనుకోకుండా నా కాలికి తగిలింది. మన భారతదేశ పూర్వ సంప్రదాయం ప్రకారం ఆయన వెంటనే నా కాలికి దన్నం పెట్టుకున్నారు అని చెప్పాడు. అటువంటి పెద్దస్టార్‌ అలా చెయ్యడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాంటి గొప్ప వ్యక్తి పక్కనే నటించే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అని తన మనసులో మాటని బయట పెట్టాడు సుధీర్‌.

English summary

Jabardasth Fame Sudigali Sudheer Says About Pawan Kalyan in a Tv interview.Presently Sudigali sudheer was acting in Pawan Kalyan's "Sardar Gabbarsingh "movie.He says that Pawan was soo simple even though he was a big star in the industry.He says that in One occasion by mistakenly Pawan's leg touched my leg and then Pawan touches my leg according to Hindu Tradition