పవన్ వెనక్కి తగ్గాడా?

Pawan venakki thaggadaa

12:50 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Pawan venakki thaggadaa

ప్రశ్నించడానికే వచ్చానన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమయ్యాడంటూ పలు సందర్భాల్లో పలువురు ప్రశ్నలు గుప్పిస్తున్న నేపధ్యంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సైలెంట్ అవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఈ వ్యవహారంలో కేంద్రం తన వైఖరిని బద్దలుకొట్టడమేకాదు.. సూటిగా చెప్పేసింది. ఈ క్రమంలో పవన్ ఆలోచన ఏంటి? ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలుస్తారా? లేదా? ఇవే ప్రశ్నలు రాజకీయ పార్టీలను వెంటాడుతున్నాయి. ఎవరేం చెప్పినా బీజేపీ ప్రభుత్వం హోదా ఇచ్చే పరిస్థితులు లేవని ఓ వైపు ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

హోదా పై ఇటు ఏపీలో.. అటు ఢిల్లీలోనూ ప్రకంపనలు రేగుతుంటే.. మధ్యలో సమ్మర్ వెకేషన్ పేరుతో పవన్ అత్తారింటికి ఆస్ర్టేలియా వెళ్తున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. పవన్ వెళ్తాడా లేదా అన్నది పక్కనబెడితే.. హోదా రాదని పవన్‌కి ముందే తెలుసని, అందుకే టైమ్ చూసుకుని ఆస్ర్టేలియా వెళ్లిపోతున్నాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా పడిపోతున్నాయి. హోదా రాని పక్షంలో ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి ముందుకెళ్తే బాగుండేదని, హోదా ఇష్యూ ముదిరిపాకాన పడుతున్న వేళ ఫారెన్ ట్రిప్ వేయడం ఈ సమస్య నుంచి తప్పించుకోవడమేనని కొందరు నేతల వాదన.

కేంద్రంతో పోరాడితే, మరి రాష్ట్రంలో కూడా ఆయా సమస్యల పై పోరాటం చేయాలి కదా అనే మాట వినిపిస్తోంది. మొత్తానికి ఈ సమస్యను పవన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

English summary

Pawan venakki thaggadaa