ఉంటె ఉంటాం పొతే పోతాం

Pawan was angry about the government decisions

01:34 PM ON 27th January, 2017 By Mirchi Vilas

Pawan was angry about the government decisions
విశాఖ ఆర్ కె బీచ్ లో ఎపి స్పెషల్ స్టేటస్ కోసం యువత తలపెట్టిన ఉద్యమం , ప్రభుత్వం అణచివేత ధోరణి తదితర అంశాల నేపథ్యంలో జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం మీడియా సమావేశం పెట్టి ఏకి పారేసారు. కేంద్రంలోని బిజెపిని టార్గెట్ చేస్తూనే రాష్ట్రంలో చంద్రబాబు ధోరణిని ఎండగట్టాడు. పవన్ ఏమన్నాడో ఓసారి చూడండి.
ఆనాడు ఎన్నికల్లో తిప్పినపుడదు అనుభవం ఉందా అని అడగలేదు. కానీ ఇప్పుడు అనుభవం లేదు , రాజకీయాలు తెలీదు అని బిజెపి నేత సిద్ధార్ధ్ నాడ్ సింగ్ అంటున్నారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టిన శ్రద్ధ ప్రజా సమస్యలపై పెట్టలేదు
తమిళనాడు లో జల్లికట్టు ఉద్యమం వెనుక బిజెపి తీరుపై నిరసన వుంది ... తమిళనాడుని బిజెపి శాసించడం, తమిళ ప్రజలకు యువతకు నచ్చలేదు
సుజనా చౌదరి గారు జల్లికట్టు స్పూర్తితో స్పెషల్ స్టేటస్ ఎలా అంటూ ఎగతాళి చేస్తున్నారు. మరి ఏ స్పూర్తితో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారు?
మోడీ గారూ, భయపెట్టి పాలించాలనుకుంటే ఎలా .. గోటితో పోయడానికి గొడ్డలి దాకా తేవడం అంటే ఇదే ..
స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజి అన్నారు .. మరి అందులో మనకు రావాల్సిందే ఉందట దీనికి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మాటి మాటికీ మాట మారిస్తే ఎలా?
సుజనా చౌదరి , రాయపాటి సాంబశివరావు ల అవకతవకల గురించి చంద్రబాబు గారు ఓ విచారణ కమిటీ వేయాలి
మోడీ గారు ప్రజలను బానిసలుగా చూడొద్దు -- ముఖ్యంగా దక్షిణాది నుంచి నిరసనలు ఎదుర్కోవద్దు -
ఏదోవిధంగా అణచాలని చూస్తే, ఉంటె ఉంటాం పొతే పోతాం అని ఎంతకైనా తెగించాలని మేము కూడా అనుకుంటే ఏమౌతుందో తెలుసుకోండి.
ఏపీలో టిడిపి ప్రభుత్వం లా లేదు మినీ బిజెపి ప్రభుత్వంలా వుంది.

ఇది కూడా చూడండి : ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చూడండి : న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది?

English summary

Pawan was angry about the government decisions