సర్దార్ ఫంక్షన్లో పవన్ ఎమోషనల్ స్పీచ్

Pawan will give Emotional speech in Sardaar Gabbar Singh

12:54 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Pawan will give Emotional speech in Sardaar Gabbar Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ పూర్తి చేసుకొని ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి రెడీ అవుతుంది. చిత్ర బృందం అంతా ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఆడియో ఫంక్షన్ హైలెట్స్ ఏమిటంటే చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నాడని అంటున్నారు. చాలా సంవత్సరాల తరువాత, మెగా బ్రదర్స్ ని ఒక స్టేజి మీద చూడబోతున్నాం అని అభిమానులు ఆ రోజు కోసం ఆత్రుతగా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

చిరంజీవి రావడం ఒక హైలెట్ అయితే ఈ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాన్ చాలా ఉధ్వేగభరితమైన స్పీచ్ ని ఇవ్వనున్నాడని అంటున్నారుఇది మరో హైలెట్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అది పెట్టాడే కానీ పార్టీ పనులు మాత్రం నత్త నడతో సాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కి పవన్ పై పార్టీ పరం గా కోపం ఉంది. కొంతమంది అయితే ప్రశ్నిస్తాను అంటూ ఫేస్ కి మేకప్ వేసుకుంటున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ కామెంట్స్ అన్నింటికి సరైన వేధిక సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ గా మారనుంది. పవర్ స్టార్ మూవీ ఆడియో ఫంక్షన్ కాబట్టి, తాను అన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఇది సందర్బం కానప్పటికీ…పవన్ చెప్పాలి అనుకున్న విషయాన్ని సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో చెప్పునున్నాడని అంటున్నారు.

సర్దార్ పై అభిషేక్ బచ్చన్ కామెంట్స్

పవన్ ఒక జోకర్.. బాలీవుడ్ నటుడు పైత్యం

షాక్ ఇస్తున్న మెగా బ్రదర్స్

English summary

Sardaar Gabbar Singh is an upcoming Telugu action film directed by K. S. Ravindra. Produced by Pawan Kalyan and Sharath Marar. He will give emotional speech in Sardaar Gabbar Singh audio function.