కళ్యాణ్ - బాబు భేటీలో తేల్చే దేమిటి ?

Pawankalyan Meets Chandrababu Naidu

11:39 AM ON 12th November, 2015 By Mirchi Vilas

Pawankalyan Meets Chandrababu Naidu

ఎపి సిఎం చంద్రబాబుని సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది సేపటిలో కలుసుకోబోతున్నారు. వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. షూటింగ్ బిజీ కారణంగా గత విజయ దశమి నాడు జరిగిన అమరావతి రాజధాని శంకుస్థాపన కు హాజరుకాలేకపోయిన పవన్ ఇప్పుడు సిఎమ్ చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలు చర్చించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో కల్సి హైదరాబద్ శంషా బాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ కు చేరుకున్న పవన్ కొద్దిసేపటిలో సిఎమ్ ని కలవబోతున్నారు. గతంలో రాజధాని రైతులని కల్సి , వారి సాధక బాధలు తెలుసుకున్న పవన్ , ఇప్పుడు సిఎమ్ చంద్రబాబు దగ్గర వాటి గురించి ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. మర్యాద పూర్వకంగానే కలుస్తున్నట్లు హైదరాబాద్ లో మీడియా ప్రశ్నకు పవన్ బడులిచ్చినా , రాజధాని రైతుల సమస్యలు , భూసేకరణకు వ్యతిరేకిస్తున్న రైతుల ఇబ్బందులు అలాగే కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించే విషయంలో చేస్తున్న తాత్సారం తదితర విషయాలను చర్చించే ఆవకాశం వుందని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో కేంద్రంలో బిజెపి , రాష్ట్రంలో టిడిపి రావాలని భేషరతుగా మద్దతిన్చ్చిన పవన్ ఇప్పుడు పలు సమస్యలపై చర్చించి , రైతులకు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం గైకోనేలా చేస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నారు. మొత్తానికి వీరిద్దరి భేటీ ఏం తేల్చనుందో?

English summary

Pawankalyan Meets Chandrababu Naidu