ట్వీట్స్‌తో బిల్ కట్టొచ్చు..

Pay your Bills with Tweets

07:36 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Pay your Bills with Tweets

ఇకపై టెలిఫోన్, కరెంట్ మొదలైన బిల్స్ కోసం మీరు గంటలు గంటలు క్యూలో నిలబడనవసరం లేదు. ఒకే ఒక్క ట్విట్ తో వీటిని చెల్లించవచ్చు.

భారత్‌లోని ట్విట్టర్ వినియోగదారులు ఇకపై తమ తమ బిల్స్‌ను ట్వీట్ ద్వారా చెల్లించవచ్చని ట్విట్టర్ ప్రకటించింది. ఇండియాలోని లుకప్ అనే ఓ స్టార్టప్ కంపెనీతో వ్యాపార ఒప్పందం చేసుకున్నామని దీని వల్ల ట్విట్టర్‌లో @LOOKUPLITE కు యూజర్లు డైరెక్ట్‌గా మెసేజ్ పంపితే అపాయింట్‌మెంట్ బుకింగ్, సేవల ఎంక్వయిరీ, బిల్లు చెల్లింపుల వంటి పనులు చేసుకోవచ్చని ట్విట్టర్ ప్రతినిధులు పేర్కొన్నారు.

ట్విట్టర్ డైరెక్ట్ మెసేజింగ్ అనే ఒక ప్లాట్‌ఫాంపై వినియోగదారులు, వ్యాపార సంస్థలను ఒకే వేదికపై తీసుకురానున్నామని స్టార్టప్ ప్రతినిధులు చెప్పారు. ఇందుకోసం ట్విట్టర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఏపీఐలను తాము ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు. వినియోగదారులు గూగుల్ మ్యాప్స్‌కు కనెక్ట్ అయితే తమ ప్రదేశంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు, అక్కడ లభించే సేవల గురించి కూడా తెలుసుకునేలా ఈ నూతన ఫీచర్‌ను అప్‌డేట్ చేయనున్నామని, అతి త్వరలోనే దీన్ని యూజర్లకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్టార్టప్ ప్రతినిధులు చెబుతున్నారు.

English summary

Lookup lite, software company launching new mobile app services to pay online bills by using twitter direct messages and tweets. Its it testing process. Soon they are planning to launch this services across india.