ఆ యాడ్ పై ప్రజలకు క్షమాపణ చెప్పిన పేటిఎం!

Paytm says sorry to people

10:58 AM ON 15th November, 2016 By Mirchi Vilas

Paytm says sorry to people

ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నోట్ల రద్దు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. డబ్బులకోసం ప్రజానీకం అష్టకష్టాలు పడుతున్నారు. అయితే ఈ సందర్భాన్ని మార్కెట్ చేసుకునేందుకు ప్రయత్నించింది పేటిఎం. దీనిపై తాజాగా రూపొందిచిన యాడ్ వీడియో ప్రజలను కించపరిచే విధంగా ఉందంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నోట్ల మార్పిడి కోసం ప్రజలంతా బ్యాంకుల వద్ద క్యూలో నిలుచుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పేటిఎం 'డ్రామా బంద్ కరో.. పేటిఎం కరో' అంటూ యాడ్ రూపొందించింది. అందుకు పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.

ప్రజలు ఇబ్బంది పడుతుంటే యాడ్ లో హేళన చేస్తారా... అంటూ మండిపడుతున్నారు. దీంతో పేటిఎం సిఈఓ విజయ్ శేఖర్ శర్మ అందరికీ క్షమాపణలు చెప్పారు. ప్రజలందరిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే విషయంలో తమకు నమ్మకం ఉందంటూ అప్ గ్రేడెడ్ వీడియో విడుదల చేశారు. గతంలో పేటిఎం లావాదేవీలు రోజుకు 25 నుంచి 30 లక్షల వరకు ఉండేవి. అయితే రోజుకు 50 లక్షలను తాకిన మరుసటి రోజునే ఈ వివాదాస్పద యాడ్ విడుదలయ్యింది. మొత్తానికి నెటిజన్ల దాటికి పేటీఎం షేక్ అయింది.

English summary

Paytm says sorry to people