సినీ హీరో ఉదయ్‌కిరణ్ పై పీడీ యాక్ట్

PD Act Filed On Hero Uday Kiran

10:30 AM ON 26th April, 2016 By Mirchi Vilas

PD Act Filed On Hero Uday Kiran

తెలుగురాష్ర్టాల్లోని పలు కేసుల్లో నిందితుడిగావున్న సినీ హీరో నండూరి ఉదయ్‌కిరణ్(30)పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతో ఫస్ట్ టైమ్ సినీ హీరో పై పీడీ యాక్ట్ నమోదైనట్లు అయింది. అసలు ఎందుకు ఇలా చేసారంటే, మార్చి 23న జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్ ఓవర్ ద మూన్ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా సిబ్బందిని బెదిరించిన ఘటనలో అరెస్టయ్యాడు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. ఉదయ్‌కిరణ్‌ పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు.. శనివారం జైలులోనే ఆయనకు నోటీసు కూడా జారీ చేశారు.

ఇవి కూడా చదవండి: జగన్ ప్రాణాలు కాపాడిన హీరో శ్రీకాంత్

మాదాపూర్ ఫార్చూన్ టవర్స్‌లో వుంటున్న ఉదయ్‌కిరణ్‌ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాసి. సినిమాల పై మోజుతో నగరానికి వచ్చి మూడు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే మాదక ద్రవ్యాలకు అలవాటుపడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తల్లి హైదరాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పని చేస్తున్నారు. అమ్మాయిలతో జల్సాలు, డ్రగ్స్, మద్యం, పబ్‌లు, క్లబ్‌లు, జూదం అలవాటుపడ్డ ఉదయ్‌కిరణ్ డ్రగ్స్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిగా ఉన్నాడు. మొత్తం 10 కేసుల్లో నిందితుడు. కాకినాడ వన్‌టౌన్, టుటౌన్ పోలీస్ స్టేషన్లలోనూ కేసులున్నాయి. దీంతో పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అదండీ సంగతి ...

ఇవి కూడా చదవండి:కాలి బూడిదైన సర్దార్ సెట్

ఇవి కూడా చదవండి:మెగా హీరోల పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

English summary

Jubilee Hills Police filed PD act against Hero Nanduri Uday Kiran.He was recently arrested for doing non-sense in one pub and he was presently in Chanchal Guda Jail. Kakinada police also filed case against him in Kakinada One town and two town police stations.