ఒక్క సినిమాతోనే రూ కోటి అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్

Pelli Choopulu Director Tarun Bhaskar Got One Crore Check

11:50 AM ON 12th September, 2016 By Mirchi Vilas

Pelli Choopulu Director Tarun Bhaskar Got One Crore Check

అందరూ వెళ్లే మూస దారిలో కాకుండా కుటుంబ పరంగా చూడ తగ్గ చిత్రాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి 'పెళ్లి చూపులు' నిరూపించింది. అందునా బూతు కామెడీతో, డబుల్ మీనింగ్ డైలాగ్ లతో విసిగిపోయిన తెలుగు జనానికి ఎడారిలో దొరికిన మంచి నీరుగా పెళ్లిచూపులు సినిమా కనిపించిందని అంటున్నారు. కథ వినోదభరితంగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని, చిన్న సినిమా అయినా పెద్ద హిట్ కొడుతుందనడానికి పెళ్లిచూపులు సినిమా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఒక చక్కని కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని రీతిలో కలెక్షన్లు సాధించి న పెళ్లి చూపులు నిర్మాతకు, సినిమాను నమ్మిన డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షాన్ని కురిపించింది. విడుదలైన తర్వాత పెద్ద సినిమాలు ఎన్నొచ్చినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా పెళ్లిచూపులు మూవీ దూసుకుపోయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

నిర్మాత రాజ్ కందుకూరి కోటి రూపాయల వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు టాక్. ఇప్పటివరకూ ఈ సినిమా 15 కోట్ల షేర్ సాధించింది. అంతేకాదు, ఓవర్సీస్ లో కూడా ఒక మిలియన్ డాలర్లు కొల్లగొట్టి సత్తా చాటింది. దీంతో ఈ సినిమాపై నమ్మకం ఉంచిన వారందరూ ఖుషీ ఖుషీ గా వున్నారు. ఇంకా చెప్పాలంటే, ఈ చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కు పారితోషికం రూపంలో కోటి రూపాయల చెక్కు ఇచ్చాడట.

అంతేకాదు, తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ఓ లగ్జరీ కారును కూడా బహుమతిగా ఇచ్చాడట. కానీ తరుణ్ భాస్కర్ కారును సున్నితంగా తిరస్కరించాడట. సింపుల్ లైఫ్ స్టైలే తనకు ఇష్టమని... కారు వద్దని తిరిగి ఇచ్చేశాడట.

తరుణ్ భాస్కర్ సినిమాతో పాటు అతని వ్యక్తిత్వానికి కూడా నూటికి నూరు మార్కులు వేయొచ్చని సినీజనం అంటున్నారు. అంతేకాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. ఈ సినిమా ద్వారా తన బావమరిది ఆయుష్ శర్మను హీరోగా పరిచయం చేయాలని కండలవీరుడు మదిలో ఉందట. ఇదేగానీ జరిగితే కథలో దమ్ముండే మరిన్ని తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ కావడం ఖాయంగానే కనిపిస్తోంది. నిజంగా ఇప్పుడు సినీ ట్రెండ్ మారుతోంది. అన్నట్టు జూనియర్ ఎన్.టి.ఆర్ కూడా తెలుగు సినిమాలో మంచి సినిమాలు మళ్ళీ వస్తాయి, అందుకు పెళ్లిచూపులు కారణం అని కూడా కితాబిచ్చాడు.

ఇవి కూడా చదవండి: యంగ్ టైగర్ కి జగన్ హెల్ప్ !

ఇవి కూడా చదవండి: ఈ సరస్సులో నీరు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి.. ఎందుకో తెలుసా?

English summary

Recently Pelli Chupulu movie was created sensation and become super hit at the box office this movie was made with one crore and this movie was collected 15 crores till now. This movie director Tarun Bhaskar got check from this movie producer Raj Kandukuri. Producer also gifted a luxury car to Tarun Bhaskar but he rejected that luxury car by saying that he like simple life.