ఇకపై హిజ్రాలకు కూడా పెన్షన్

Pension for Hijras in Kerala

04:05 PM ON 9th July, 2016 By Mirchi Vilas

Pension for Hijras in Kerala

ఒకప్పుడు విదేశీయులకు మాత్రమే పరిమితం అయిన హిజ్రాలు గత కొంత కాలంగా ఇండియాలో సైతం భారీగా పెరుగుతున్నారు. వివిధ కారణాల వల్ల భారీ స్థాయిలో హిజ్రాలు పెరుగుతున్నారు. అయితే ఇండియాలో వారికంటూ ఇప్పటి వరకు ప్రత్యేక గుర్తింపు అంటూ లేదు. అయితే మొదటగా కేరళలో హిజ్రాల కోసం ప్రభుత్వం కొత్తకొత్త పథకాలు ప్రారంభిస్తోంది. ఇటీవలే కొచ్చి మెట్రో వారు వీరికి ప్రత్యేకంగా ఉద్యోగాలను ఇచ్చింది. అదే దారిలో కేరళ ప్రభుత్వం వీరి కోసం ప్రత్యేక పథకాలను సైతం ప్రవేశ పెడుతోంది. అవేంటంటే ఇకపై ప్రతీ నెల హిజ్రాలకు పెన్షన్ ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే 60 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ముసలి వారికి పెన్షన్ తో పాటు, మిగిలిన వారికి ఉద్యోగాల్లో సడలింపు, ఇంకా పలు పథకాలను వారికి వర్తింపజేయనున్నట్లుగా కేరళ సీఎం పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో మొత్తం 25 వేల మంది హిజ్రాలు ఉన్నట్లుగా తాజా లెక్కలో తేలింది. వారిలో 3,500 మంది 60 సంవత్సరాలు దాటిన వారు ఉండగా.. వారికి నెల నెల 1000 చొప్పున పెన్షన్ ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో హిజ్రాలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధానం దేశ వ్యాప్తంగా కూడా అమలు చేయాలని మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న హిజ్రాలు ఆశపడుతున్నారు.

English summary

Pension for Hijras in Kerala