నోట్ల రద్దు యవ్వారం వరంగా మారిన వైనం

People are paying old bills with banned notes

12:29 PM ON 15th November, 2016 By Mirchi Vilas

People are paying old bills with banned notes

అటొచ్చి ఇటొచ్చి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన పెద్ద నోట్ల రద్దు సామాన్యులను కొంత మేర ఇబ్బంది పెడుతున్నా, సహనంతో ప్రజలు భరిస్తున్నారు. అయితే పంచాయతీలు, కార్పొరేషన్లకు ఈ రద్దు యవ్వారం మాత్రం వరంలానే కనిపిస్తోంది. పన్ను కట్టేందుకు పాత నోట్లను తీసుకుంటామని ప్రకటించటంతో.. కొన్ని సంవత్సరాలుగా ఇంటి పన్ను, కొళాయి పన్ను కట్టని వారంతా ఒక్కసారిగా ఆ బకాయిలు మొత్తం తీర్చేస్తున్నారు. దీంతో కార్పొరేషన్లు, పంచాయతీలకు కోట్లలో డబ్బు వచ్చి పడుతోందని అధికారులు అంటున్నారు. చెన్నైలోని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కి ఆదివారం ఒక్క రోజే రూ.7.21 కోట్ల పన్ను బకాయిలు వసూలైనట్లు అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో పన్ను బకాయిలను పాత నోట్లతో చెల్లించవచ్చని ప్రకటించామని, దాని కోసం ప్రత్యేకంగా 446 కౌంటర్లను ఏర్పాటు చేశామని అక్కడి అధికారులు తెలిపారు. ఈ ప్రకటనకు మంచి స్పందన వచ్చిందని, ఆదివారం ఒక్కరోజే రూ.7.21 కోట్లు వసూలయ్యాయని, అది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సెలవు రోజైన సోమవారం కూడా ఈ ప్రత్యేక కౌంటర్లు పనిచేస్తాయని వారు తెలిపారు.

English summary

People are paying old bills with banned notes