కుండీలో చెత్త వేయండి - ఫ్రీ వైఫై ఇంటర్నెట్ పొందండి

People Can Enjoy Free Wifi By Using These Garbage Bins

11:17 AM ON 9th January, 2017 By Mirchi Vilas

People Can Enjoy Free Wifi By Using These Garbage Bins

క్లిన్ అండ్ గ్రీన్ పెట్టినా, స్వచ్ఛ భారత్ పెట్టినా చెత్త సమస్య తీరడం లేదు. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ల్లో పారిశుధ్యం కూడా ఒకటిగా తయారైంది. చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలే కాదు, పేరు గాంచిన నగరాల్లోనూ ఇప్పుడు ఈ సమస్య తీవ్ర తరమవుతోంది. ప్రధానంగా ఇండ్లు, హోటల్స్ , కార్యాలయాలు తదితర ప్రదేశాల నుంచి పెద్ద మొత్తంలో వెలువడుతున్న చెత్తను సేకరించడం దాన్ని రీసైకిల్ చేయడం ప్రభుత్వాల కు సవాల్ గా మారింది. ఇక యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోతుంది. అలాంటి చెత్తను చూసినప్పటికీ కొందరు ఏం చేస్తున్నారంటే ఆ చెత్త మీదే ఇంకా చెత్త పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిలో మార్పు తేవడం కోసం, చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ముంబైకి చెందిన ఓ స్టార్టప్ వినూత్న ప్రయోగంతో ముందుకు వచ్చింది. వాటివివరాల్లోకి వెళ్తే,

ముంబై నగరానికి చెందిన థింక్ స్క్రీమ్ (THINK SCREAM) అనే ఓ స్టార్టప్ కంపెనీ కొత్తగా వైఫై ట్రాష్ బిన్ లను తయారు చేసింది. వీటిలో చెత్త వేస్తే చాలు. యూజర్లు 15 నిమిషాల పాటు వైఫైని ఉచితంగా వాడుకోవచ్చు. అయితే ఈ వైఫై ట్రాష్ బిన్ సాధారణ చెత్త కుండీలను పోలి ఉంటుంది. ఎత్తు నాలుగున్నర అడుగులు ఉంటుంది. దీని కింది భాగంలో ఓ ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ ఉంటుంది. అది యూజర్లు వేసిన చెత్తను గుర్తించి పైభాగంలో అమర్చిన ఎల్ ఈడీ స్క్రీన్ కు మెసేజ్ పంపుతుంది. దీంతో ఆ మెసేజ్ ను రిసీవ్ చేసుకున్న ఎల్ ఈడీ స్క్రీన్ పై ఓ పాస్ వర్డ్ దర్శనమిస్తుంది. దాన్ని ఉపయోగించి ట్రాష్ క్యాన్ లో అమర్చిన వైఫై రూటర్ కు యూజర్లు కనెక్టవచ్చు. అలా చెత్త వేశాక ఓసారి వైఫైకు కనెక్ట్ అయితే దాన్ని 15 నిమిషాల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. 50 మీటర్ల దూరంలోనూ ఆ వైఫై ద్వారా ఇంటర్నెట్ పొందవచ్చు.

ఈ మధ్యే కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వైఫై ట్రాష్ బిన్ లకు మంచి స్పందనే వస్తుందని సదరు స్టార్టప్ చెబుతోంది. ఈ క్రమంలో ముంబై వ్యాప్తంగా ఇలాంటి వైఫై ట్రాష్ బిన్ లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. అయితే కేవలం ముంబైలోనే కాకుండా దేశంలో ఉన్న అన్ని నగరాలు, పట్టణాల్లోనూ ఇలాంటి ట్రాష్ బిన్ ల ను ఏర్పాటు చేస్తే ఇక సమస్య చాలావరకూ తీరినట్టే కదా......

ఇవి కూడా చదవండి: అభిమానం హద్దు మీరితే చర్యలు

ఇవి కూడా చదవండి: ఇవి తింటే అన్నిరకాలుగా పుష్టిగా ఉంటారట

English summary

Government of India was taking so many steps to keep India Clean and Green but there was only slight response from the people and now a new start up company was created a WiFi garbage bins and these garbage bins will allow you to get free WiFi by its usage.