రిలేషన్షిప్ లో ఉంటే మనుషులు మారిపోతారా..?

People change once they are in a relationship

04:40 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

People change once they are in a relationship

మీరు ఎవరితోనైనా డేటింగ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత చాలా మారిపోయారని మీ ఫ్రెండ్స్ దెప్పిపొడుస్తున్నారా.. అయితే వారు చెప్పేది వంద శాతం కరెక్టేనట. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అంశంపై ద ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఒక కొత్త రొమాంటిక్ రిలేషన్షిప్ ప్రారంభించిన తర్వాత మనుషులు తమ స్నేహితులకంటే.. రొమాంటిక్ పార్ట్నర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా అనే విషయంపై ఈ సర్వే నిర్వహించారు. ఈ అధ్యయనంలో డేటింగ్ లో ఉన్న వ్యక్తులు తమ స్నేహితులను ఫాలో అవ్వడానికంటే తన భాగస్వామిని అనుసరించడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని వెల్లడైంది. అంత వరకూ డేటింగ్ అంటే తెలియని వ్యక్తి డేటింగ్ ప్రారంభించిన తర్వాత గతంలో స్నేహితుల్లో ఒకడిగా కలసిపోయి ఉండేవాడు కాస్తా.. రొమాంటిక్ పార్ట్ నర్ మాదిరిగా బిహేవ్ చేస్తుంటాడట.

రొమాంటిక్ రిలేషన్షిప్ ప్రారంభించిన తర్వాత ఫ్రెండ్ సిమిలారిటీపై నిర్వహించిన మొదటి అధ్యయనం ఇదే. తమ అధ్యయనంలో స్నేహితుల ఫిర్యాదులు కరెక్టే అని తేలిందని, రొమాంటిక్ పార్ట్ నర్స్ స్నేహానికి కాస్త దూరంగానే ఉంటారని తాము గుర్తించినట్టు ఈ సర్వేలో పాలు పంచుకున్న బ్రెట్ లార్సెన్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తన తోటి మగ స్నేహితులు బోర్ కొట్టేస్తారని, వారికి ప్రాధాన్యత తగ్గిపోతుందని, ఇదే సమయంలో స్నేహితుల ప్లేస్ లో తన రొమాంటిక్ పార్ట్ నర్ కు ప్రాధాన్యత పెరుగుతుందని, రొమాంటిక్ అఫిలియేషన్ కు వీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పారు. ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ ప్రారంభించిన తర్వాత మనుషులు క్లోజ్ రిలేషన్షిప్ లను బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారని, అయితే ప్రాధాన్యతా క్రమంలో స్నేహాన్ని రొమాంటిక్ రిలేషన్షిప్ డామినేట్ చేస్తుందని పేర్కొన్నారు. తన భాగస్వామికి దగ్గర కావడం కోసం ఆమె/అతని ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకోవడం.. ఆమె/అతని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుందని, దీంతో స్నేహితులతో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అలాగే గతంలోలా స్నేహితులతో కలసి మందు కొట్టడానికి కుదరదని, దీనిపైనా రొమాంటిక్ పార్ట్ నర్స్ ప్రభావం ఉంటుందని వివరించారు. అందుకే మీ స్నేహితులు చెప్పింది వంద శాతం కరెక్ట్. మీరు సింగిల్ గా ఉన్నప్పుడు ఉన్నట్టుగా రొమాంటిక్ రిలేషన్షిప్ ప్రారంభించిన తర్వాత ఉండరు. ఆ తర్వాత కంప్లీట్ గా మారిపోతారు.

చూపుతో మీ కోరికలను అంచనా వేసేస్తారట

అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం ఎలా..?

సెక్స్ గురించి వర్జిన్లు తెలుసుకోవాల్సిన 9 విషయాలివే..

మగాళ్లను రెచ్చిపోయేలా చేసే 9 ఫోర్ ప్లే మూవ్స్ ఇవే..

English summary

The Florida Atlantic University study put to test the hypothesis that adolescents become less similar to their friends and more similar to romantic partners after they start a new romantic relationship.