ఉడుమును ముక్కలుగా కోసి... ఏం చేసాడో తెలిస్తే భయపడతారు(వీడియో)

People cuts Skunk into pieces and embroys the blood

04:15 PM ON 27th October, 2016 By Mirchi Vilas

People cuts Skunk into pieces and embroys the blood

పట్టుపడితే ఉడుం పట్టులా వుండాలని అంటారు కదా. ప్రస్తుతం ఉడుములు రేర్ గా వుంటున్నాయట. అయితే ఉడుముల్ని పట్టుకొని ముక్కలుగా కోసి వాటి రక్తాన్ని గాజు గ్లాసుల్లో పిండుతున్న వీడియో దృశ్యాలు సోషల్ మీడియా, తమిళనాడు న్యూస్ పోర్టర్లలో విస్తృతంగా హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వీడియో వెలుగు చూడటంతో దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చెన్నైలోని రాష్ట్ర వన్యప్రాణి ప్రధాన కార్యాలయం అధికారులు అటవీ శాఖ రేంజర్లను ఆదేశించారు. ఓ వ్యక్తి ఉడుముని ముక్కలుగా కోసి దాని శరీరభాగాల నుంచి గాజు గ్లాసులోకి రక్తాన్ని పిండుతుండగా, ఆయన సమీపంలో కొందరు పురుషులు చూస్తూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

తమిళనాడులో ఉడుంబుగా పిలిచే ఉడుము రక్తం, దాని మాంసం తీసుకుంటే కండరాలు పటిష్ఠంగా తయారవుతాయనే నమ్మకంతో కొందరు గిరిజనులు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని అధికారులు చెపుతున్నారు. ఇలా ఉడుములను రక్తం కోసం చంపడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద తీవ్రమైన నేరమని, ఉడుము సరీసృపాల రక్షిత జంతువు అని చెన్నై వన్యప్రాణి వార్డెన్ కె గీతాంజలి చెప్పారు. ఈ వీడియో పాలవంతంగల్ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాంచీపురంలోని అటవీ ప్రాంతంలో నివశించే గిరిజనులు కొందరు చెన్నైలో స్థిరపడ్డారని వారే ఇలా ఉడుముని చంపి రక్తాన్ని తీశారని అటవీశాఖాధికారులు అంటున్నారు. రక్తం కోసం ఉడుములను చంపిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపడంతో అటవీశాఖ వన్యప్రాణివిభాగం అధికారులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

English summary

People cuts Skunk into pieces and embroys the blood