17నెలల్లో 2234 మందికి హెచ్ఐవి

People get HIV after blood transfusion

11:37 AM ON 1st June, 2016 By Mirchi Vilas

People get HIV after blood transfusion

ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రమాద కరమైన హెచ్ ఐ వి వ్యాధి విస్తరిస్తూనే వుంది. ముఖ్యంగా రక్తమార్పిడి కారణంగా కూడా ఈ వ్యాధి సోకుతోంది. విషయం ఏమంటే, భారతదేశంలో గత 17నెలల్లో రక్తమార్పిడి కారణంగా 2234 మంది ప్రజలకు ప్రమాదకర హెచ్ఐవీ వైరస్ సోకిందని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. 2014 అక్టోబరు నుంచి 2016 మార్చి వరకు రక్తమార్పిడి ద్వారా 2234 మంది ఎయిడ్స్ బారిన పడ్డట్లు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(నాకో) వెల్లడించింది.

1/6 Pages

20.9లక్షల మంది వ్యాధిగ్రస్తులు ... 

చేతన్ కొఠారి అనే కార్యకర్త దాఖలు చేసిన సమాచార హక్కు పిటిషన్ ఆధారంగా ఎయిడ్స్ వ్యాధి సోకిన వారి వివరాలు వెల్లడయ్యాయి. రక్త దాతలకు కచ్చితంగా హెచ్ఐవీ, హెచ్బీవీ, హెపటైటిస్ సి, మలేరియా, సిఫిలిస్ తదితర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. రక్తం సురక్షితమైనదని నిర్ధారించిన తర్వాతే ఇతరులకు ఎక్కించాలి. కానీ నిర్లక్ష్యం కారణంగా చాలా మంది బలవుతున్నారు. 2011 నాటికే భారత్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారు 20.9లక్షల మంది ఉన్నారని అంచనా. వీరిలో 86శాతం మంది 15నుంచి 49ఏళ్ల వయసు వారు.

English summary

People get HIV after blood transfusion.