కరెంటు బిల్ తగ్గించుకోవడానికి కొత్త టెక్నిక్!

People reducing their current bills with tv remotes

05:48 PM ON 27th July, 2016 By Mirchi Vilas

People reducing their current bills with tv remotes

మాములుగా కరెంటు వాడిన దానిని బట్టి మీటర్ తిరుగుతుంది. మీటర్ రీడింగ్ ను బట్టి కరెంటు బిల్ ను వేస్తారు. ఇది కరెంటు బిల్ ను జమా కట్టే పద్ధతి. అయితే అక్కడక్కడ కొంత మంది కరెంటు బిల్ ను కాస్తో కూస్తో తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తమకు తెలిసిన టెక్నిక్స్ ద్వారా మీటర్ ను తిరగకుండా ఆపుతుంటారు... దాంతో కరెంటు బిల్ తక్కువగా వస్తుంది. జనాలు ఇలా తెలివిమీరారు అనే ఉద్ధేశ్యంతోనే కరెంటు సంస్థ పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను మంజూరు చేసింది. మీటర్లు అన్నీ సీల్ చేసి మరీ ఇంట్లో ఫిక్స్ చేసి ఇచ్చింది. దీనిని టాంపరింగ్ చేయడానికి వీలు లేని విధంగా రూపొందించింది.

అయితే ఇప్పుడు ఆ మీటర్లనే.. టీవీ రిమోట్ తో ఆన్/ఆఫ్ చేసేస్తున్నారట. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో పలువురు వినియోగదారులు కొత్త మీటర్లు... తప్పుడు రీడింగ్స్ చూపించడం వల్ల వారికి కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందని చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేసినా సదరు విద్యుత్ సంస్థ పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన కొంతమంది వినియోగదారులు టీవీ రిమోట్ తో మీటర్ల నియంత్రణ మొదలు పెట్టారట! సాఫ్ట్ వేర్ లో సాంకేతికలోపం వల్లే అలా జరుగుతోందన్న అధికారులు మీటర్లు మార్చాలని నిర్ణయిం తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి ప్రజలు తమ తెలివితేటల్ని ఓ రేంజ్ లో చూపిస్తున్నారు. మరి ఈ మీటర్లు కూడా మార్చాక కొత్తగా ఏం టెక్నిక్ వాడతారో చూడాలి మరి.

English summary

People reducing their current bills with tv remotes