రోడ్డు మీద నరికేస్తుంటే.. లైవ్ షోగా మార్చేశారు(వీడియో)

People shoots live murder in cellphone cameras

10:26 AM ON 24th June, 2016 By Mirchi Vilas

People shoots live murder in cellphone cameras

వెర్రి బాగా ముదిరి పోయిందంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. టెక్నాలజీ పుణ్యమా మనం కొత్త పుంతలు తొక్కుతున్న మాట వాస్తవమే కానీ.. అదే టెక్నాలజీ కారణంగా మన ఉనికి కోల్పోయే పరిస్థితి దాపురించింది. ఇక మానవత్వం మంటకలిసి, అన్నీ మరిచిపోతున్నాము. తాజాగా దుబాయ్ లో ఓ పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే దాని మీద స్పందిచాల్సింది పోయి చాలా మంది అక్కడికి వెళ్లి సెల్ఫీలు తీసుకొని పోస్ట్ చేశారు. అలాగే నేపాల్ లో భారీ భూకంపం వచ్చి అంతా నాశనం అయితే చాలా మంది సెల్ఫీలు తీసుకొని పోస్ట్ లు పెట్టడం మరీ దురద్రుష్టకరం. అయితే మన దగ్గర అంతకన్నా దారుణం చోటుచేసుకుంది.

కళ్లెదుట ఓ మర్డర్ జరుగుతున్నా.. సెల్ ఫోన్లలో షూట్ చేశారు కానీ ఎవరూ దాన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం ఎవరూ చెయ్యలేదు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం హసన్ పట్టణంలో చోటుచేసుకుంది. ఒక యువకుడు కత్తిపోటుతో నెత్తురోడుతూ బాధతో నేల పై పడి విలవిల్లాడుతుంటే వేడుక జరుగుతున్నట్లు చందంగా.. వారి వారి సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించేందుకు పోటీ పడటం విచిత్రం. మానవత్వం మంటగలిసిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఓ యువకుడు బస్టాండ్ లో నిలుచున్న ఓ అమ్మాయిని వేధించాడు.

అక్కడున్న మరో ఇద్దరు యువకులు అతడితో గొడవపడ్డారు. ఈ క్రమంలో రెండు గ్రూపులు రోడ్డుపై కొట్టుకున్నారు. ధనుష్ అనే యువకుడు తీవ్ర గాయాలతో రోడ్డు పై పడిపోగా అక్కడున్నవారిలో ఒక్కరు కూడా ముందుకురాలేదు. చివరకు పోలీసులు వచ్చి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొన్నాయి. అదండీ సంగతి.

English summary

People shoots live murder in cellphone cameras