చెన్నైవాసుల కష్టాలు ఇన్నిన్నికాదయా

People Struggles Chennai

12:08 PM ON 4th December, 2015 By Mirchi Vilas

People Struggles Chennai

ఇంచుమించు దీపావళి నుంచి వానలు తమిళనాడుని కుదిపేశాయి. ముఖ్యంగా చెన్నైని ముంచెత్తాయి. ఇంకా వర్షాలు చెన్నై నగరాన్ని వెంటాడుతున్నాయి. సముద్ర తీర ప్రాంతమైన చెన్నై మహా నగరాన్ని వానలు వరదలై , సంద్రంగా మార్చేశాయి. కన్నీటి కడలిగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు సందడిగా కనిపించిన ఈ మహానగరం ప్రస్తుతం కళా విహీనమైంది. ఎటు చూసినా నీరే. వరద నీటిలో , డ్రైనేజి వాటర్ తో అపార్ట్ మెంట్ కింది ఫ్లోర్లు నిండిపోయాయి. కిందికి దిగలేక , పైన చీకట్లో మగ్గలేక , తిండితిప్పలు లేక జనం నరకయాతన భరించారు. ఇంకా కొన్ని చోట్ల పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. . వరుస అల్పపీడనాలతో విపత్తు చేసిన విధ్వంసంతో చెన్నై వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్న చిన్న విషయాలకు వారు పడుతున్న అవస్థలు చెప్పనలవి కాదు. వరద బీభత్సానికి . చుట్టూ నీళ్లున్నా.. తాగేందుకు.. కనీస అవసరాల కోసం నీరు దొరకని దుస్థితి నెలకొంది. భయానక పరిస్థితిని సైతం కొందరు వ్యాపారానికి వేదికగా మార్చిన వైనం కనిపిస్తోంది. నిన్నటి వరకూ క్యాన్ రూ.30 లభించిన మంచినీటి క్యాన్ ఇప్పుడు రూ.250 పలుకు తోందట. కూరగాయల ధరలు సరే సరి.

వరద కష్టానికి తోడు ధరల దెబ్బతగులుతుంటే , డబ్బున్నా సరే కష్టాలు తప్పడం లేదు కొందరికి. .చేతిలో పెద్దగా డబ్బుల్లేని వారు కొందరైతే.. బ్యాంకుల్లో నిండుగా డబ్బులు ఉంచుకొని.. రేపు డ్రా చేద్దామని వర్షానికి ఊరుకున్న వారు ఇప్పుడు నరకం చూస్తున్నారు. తాము చేసిన తప్పుకు బ్యాంకులో డబ్బులున్నా, చేతిలో చిల్లి గవ్వ లేక విలవిలలాడుతున్నారు. విద్యుత్తు సౌకర్యంతో లేకపోవడంతో ఏటీఎంలు మూసేయంతో.. ఈ దుస్థితి నెలకొంది. విద్యుత్ లేని కారణంగా ఆఖరికి తమ కష్టాలు చెప్పుకోవడానికి ఫోన్లు సైతం మూగపోయాయి.. కంటి మీద కునుకు లేకుండా బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నవారు కొందరైతే , ఈ నరకం చూడలేమంటూ గగ్గోలు పెట్టేవారు మరికొందరు.

English summary

Chennai people were struggling with the rains and floods in chennai . Chennai flooded by heavy and continuous rain. Due to rain water on the chennai airport runway the airport remains closed and the flight were turned towards banglore airport, trains have been cancelled and the army and navy is helping rescue stranded people.All the rates are gone high .. A 10 rupees water bottle is selling to 50 rupees