ఉప పోరుపై ఎవరేమంటున్నారు

People Views On Warangal Bi-Election

11:54 AM ON 24th November, 2015 By Mirchi Vilas

People Views On Warangal Bi-Election

వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు టి ఆర్ ఎస్ గెలుపు దిశగా సాగుతుంటే , విపక్షాలకు మాత్రం ఫలితాలు మింగుడు పడడం లేదు. లెక్క ఎక్కడ తప్పిందో నని విశ్లేషిస్తున్నారు. భారీ ఆధిక్యంతో టి ఆర్ ఎస్ దూసుకు పోతుంటే , ఆపార్టీ శ్రేణులు ఆనందంతో చిందులు వేస్తున్నారు. వరంగల్‌ ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉండటం పట్ల టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నన్నపనేని నరేందర్ ఆనందం వ్యక్తం చేస్తూ , వరంగల్ ఉపపోరులో ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని అభివర్ణించారు.

టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు స్పందిస్తూ , టీఆర్ఎస్ ఫలితాలు కేసీఆర్ పరిపాలనకు నిదర్శనమన్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని తెలిపారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీని టీఆర్‌ఎస్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను విచ్ఛినం చేసే కుట్రను వరంగల్ ప్రజలు తిప్పి కొట్టారన్నారు. కేసీఆర్ పాలన ప్రజల వద్దకు వెళ్లిందనడానికి వరంగల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని పేర్కొన్నారు. ప్రచారంలో నిరసనలు ప్రతిపక్షాల సృష్టే అని ఆయన ఆరోపించారు.

టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి ఎన్నికల ఫలితంపై స్పందిస్తూ ,వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రజాతీర్పును శిరసావహిస్తామన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ ఇలానే ఉంటాయన్నారు. గతంలో వైసీపీ ఉప ఎన్నికల్లో ఇదే ఫలితాలు సాధించిందని, సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందన్నారు. తెలంగాణలో 2019 ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుందన్నారు. టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం మేమే అన్నారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలన్నారు. అలాగే ప్రస్తుతం పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రావు అమరేందర్‌రెడ్డి విమర్శ ల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు. ప్రచారం సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయలేదని...కేబినెట్ మొత్తం వరంగల్‌లోనే ఉందన్నారు. ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకతతోనే విద్యావంతులు ఓటింగ్‌లో పాల్గొనలేదని తెలిపారు.

English summary

TRS almost won in Warangal By-election .The result yet to be released but almost the result comes in favour TRS party .Trs party leads with huge ammount of votes in Votes Counting Process.The remaining parties were thinking about the reason for defeat in the elections. Different different people says their views on this election