పెప్సీ నుండి ఇక మొబైల్‌ ఫోన్‌లు

Pepsi To Launch Smart Phones

11:28 AM ON 21st November, 2015 By Mirchi Vilas

Pepsi To Launch Smart Phones

శీతల పానీయాల కంపెనీ పెప్సీ ఇక నుండి మొబైల్‌ మార్కెట్‌లోకి అడుగిడుతోంది. బ్రాండింగ్‌, మార్కెటింగ్‌లో తిరుగులేని పెప్సీ కంపెనీ తీసుకున్న నిర్ణయం మొబైల్‌ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత నెలలో తమ అరంగేట్రం కోసం ప్రకటన చేసిన పెప్సీ ఇప్పుడు తమ కొత్త మొబైల్‌ ఫోన్‌ గురించిన ఫీచర్లను వెల్లడించింది. పెప్సీ కొత్త మొబైల్‌ ఫోన్‌ పి1. ఈ ఫోన్లను ప్రస్తుతానికి మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసేందుకు పెప్సీ సిద్ధంగా లేదు. చైనాకు చెందిన క్రౌడ్‌ఫండింగ్‌ కంపెనీ అయిన జెడి.కామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా అమ్మకాలు సాగించేందుకు పెప్సీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చేనెల డిసెంబర్‌లోపు 30లక్షల మొబైల్‌ ఫోన్‌ అమ్మకాలు చేసేందుకు కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారత కరెన్సీ ప్రకారం 5వేల రూపాయల ధరకే స్మార్ట్‌ ఫోన్‌ను అందిస్తున్న పెప్సీ పి1 ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.

పి1 స్మార్ట్‌ ఫోన్‌లో 1.7గిగాహెర్జ్ట్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను పొందుపరిచారు. 2జిబి రామ్‌ కలిగిన ఈ ఫోన్‌కు 16జిబి మెమెరీ, 64జిబి వరకు ఎక్స్‌పాండబుల్‌ మెమరీ ఉంది. 13మెగా పిక్సెల్‌ వెనుక కెమెరా, 5మెగా పిక్సెల్‌ముందు కెమెరా కలిగిన ఈ ఫోన్‌లో 4జి ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేసుకోవచ్చు. నీలం, బంగారం, సిల్వర్‌ రంగులలో ఈ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది.

పెప్సీ బ్రాండ్‌ ప్రపంచంలో ప్రతీ ఒక్కరిని చేరిన బ్రాండ్‌. అలాంటి బ్రాండ్‌ ఇప్పుడు మొబైల్‌ ఫోన్ల రంగంలోకి కూడా ప్రవేశించడంతో ఈ రంగంలో మరింత గట్టి పోటీ రావచ్చని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

English summary

Pepsi, the brand most associated with aerated soft drinks, has entered the smartphone market with its P1 budget handset. The company had announced its plans to release a smartphone last month.