రోజుకు 3 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు... కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

Per day 3 sun rises and 3 sun sets in this new planet

11:42 AM ON 16th July, 2016 By Mirchi Vilas

Per day 3 sun rises and 3 sun sets in this new planet

ఇదేదో వింతగా ఉందా, అవును నిజమే... సైన్స్ ఇంత పెరిగినా.. మనిషికి తెలిసినవి కొన్ని మాత్రమే... ఇక అనంత విశ్వంలో అద్భుతాలెన్నో ఉంటాయి. అదే రీతిలో అమెరికాలోని అరిజోనా వర్సిటీ శాస్తవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. అంతరిక్ష్యంలో ఓ కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. ఈ గ్రహం బరువు బృహస్పతి కంటే నాలుగు రెట్లు ఉండగా.. ఇది మూడు నక్షత్రాల చుట్టూ తిరుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే.. ఈ గ్రహానికి మూడు సూర్యుళ్లు ఉంటారన్న మాట. అంతేకాదు.. ఈ మూడు సూర్యుళ్ల పుణ్యమా అని నిత్యం మూడు సూర్యోదయాలు.. మూడు సూర్యాస్తమయాలు ఉంటాయి.

అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ గ్రహంపై, శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్ధమయ్యారు. భూమికి 340 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహం ఉందంటున్నారు. ఇక ఈ గ్రహంలో ఒక రోజు అంటే, మనిషి జీవిత కాలం కంటే ఎక్కువని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని వయసు 1.6 కోట్ల సంవత్సరాలుగా చెబుతున్నారు. కొత్తగా కనుగొన్న ఈ గ్రహానికి 'హెచ్ డీ 131399 ఏబీ' అన్న పేరు పెట్టారు. ఇప్పటివరకూ కనుగొన్న అతి తక్కువ వయసున్న ఎక్సో గ్రహాల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు. అంతేకాదు, ఈ గ్రహాన్ని ప్రత్యక్షంగా ఫోటోలు తీయగలిగారు.

ఇక, ఈ గ్రహం మీద ఉష్ణోగ్రతలు వింటే దిమ్మ తిరిగిపోవటం ఖాయం. ఈ గ్రహం మీద ఉష్ణోగ్రత 580 డిగ్రీలు. ఒక సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే మరో సూర్యుడు ఆస్తమిస్తూ ఉంటాడని చెబుతున్న శాస్త్రవేత్తలు.. ఇక్కడి ఏడాదిలో నాలుగో వంతు వరకూ సూర్యోదయంలోనే ఉంటుందంటున్నారు. అంటే, ఈ గ్రహంలో రాత్రి అన్నది లేదనట్లే అంటున్నారు. అదండీ సంగతి.

English summary

Per day 3 sun rises and 3 sun sets in this new planet