చైనా మహిళా కండోమ్‌కు అనుమతి

Permission for China Woman Condom

09:50 AM ON 11th March, 2016 By Mirchi Vilas

Permission for China Woman Condom

అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఒక చైనా కంపెనీ మహిళల కోసం రూపొందించిన కండోమ్‌ అడ్వాన్స్ అర్హతను సాధించింది.ప్రోగ్రామ్‌ ఫర్‌ అప్రాప్రియేట్‌ టెక్నాలజీ ఇన్‌ హెల్త్‌, కోనార్డ్‌ ఎన్‌ హిల్టన్‌ ఫౌండేషన్‌లు చైనా పరిశోధన భాగస్వాములతో కలిసి సంయుక్తంగా ఈ మహిళా కండోమ్‌ను రూపొందించాయి. ఇది సమర్థవంతమైందే కాక, సురక్షితమైందని ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఐరాస జనాభా నిధి తేల్చాయి. దీన్ని ప్రజలకు పెద్దఎత్తున పంపిణీ చేయటానికి అనుమతించాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతించటంవల్ల ఈ కండోమ్‌ను ప్రజలకు పంపిణీ చేయటానికి ఐరాస సంస్థలకు, ఇతర అంతర్జాతీయ కొనుగోలుదార్లకు అనుమతి లభిస్తుంది. గర్భ నిరోధానికి, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో పాటు సుఖవ్యాధుల బారి నుంచి కాపాడుకోవటానికి మహిళలకు మరొక అవకాశం లభించినట్టవు తుందని అంటున్నారు. మహిళల కండోమ్‌లకు గిరాకీ ఎక్కువగా ఉన్నప్పటికీ. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. మరి ఇవి ఎప్పుడు మార్కెట్ లోకి వస్తాయో ఇంకా వెల్లడి కాలేదు. చైనా వస్తువులకు భారత్ లో వున్న గిరీకీ దృష్ట్యా ఈ కండోమ్‌లకు కూడా గిరాకీ వస్తుందేమో ...

English summary