జల్లి కట్టుకి గ్రీన్ సిగ్నల్ ....

Permission granted for jellykattu

11:56 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Permission granted for jellykattu

తమిళనాడు మరో విజయం సాధించింది. అదే జల్లికట్టుకు కేంద్రం అనుమతి ఇవ్వడం.... సంక్రాంతి పర్వదినాన తమిళనాడులో సంప్రదాయ బద్ధంగా నిర్వహించే జల్లికట్టుకు కేంద్రం నుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తనకు ఫోన్‌ చేసి తెలిపారని కేంద్ర మంత్రి పన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. ఈ సందర్భంగా జల్లికట్టు నిర్వహణకు మద్దతిచ్చిన ప్రధానమంత్రి మోదీ తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాధాకృష్ణన్‌ ట్వీట్‌ చేశారు.

జల్లికట్టు విధానంపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో సంప్రదాయానికి తగినట్లుగా ఆటను నిర్వహించేందుకు చట్టంలో సవరణలు తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఫలితంగా కేంద్రం సానుకూలంగా స్పందించింది.

English summary

Permission granted for jellykattu