ఛీ ఛీ... రెండో తరగతి బాలికపై టీచర్ లైంగిక దాడి(వీడియో)

PET harassed second class school girl

06:21 PM ON 1st November, 2016 By Mirchi Vilas

PET harassed second class school girl

చిన్న పిల్లలని కూడా చూడకుండా సాక్షాత్తూ గురువులే లైంగిక వేధింపులకు దిగడం దారుణం. సభ్యసమాజానికే ఇది తలవంపు. విషయం ఏమంటే, ఈసీఐఎల్ లోని ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్న తమ కుమార్తెను పీఈటీ చంద్రశేఖర్ లైంగికంగా వేధిస్తున్నాడని ఆ బాలిక తల్లిదండ్రులు అశోక్, సుబాషిణిలు ఆరోపిస్తున్నారు. రెండు నెలల నుంచి తమ పాపని చిత్రహింసలకు గురిచేశాడని.. ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించాడని వాళ్ళు పేర్కొంటున్నారు. గేమ్స్ ఆడే సమయంలో పాపని పిలిచి, ఓ చోటుకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేవాడని ఆ బాలిక తండ్రి అశోక్ తెలిపారు.

ఇక పీఈటీ చేసిన దారుణాల్ని బాలిక కూడా ఏకరువు పెట్టింది. తనని నిత్యం భయపెట్టేవాడని, హగ్ చేసుకునేవాడని, కిస్ కూడా చేసేవాడని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. అతను పెడుతున్న టార్చర్ ని తట్టుకోలేక స్కూలుకే వెళ్ళాలనిపించడంలేదని ఆ బాలిక తెలిపింది. ఆ అమ్మాయి మాటల్ని బట్టి చూస్తుంటే, ఆ పీఈటీ ఎలా టార్చర్ పెట్టాడో తెలుస్తోంది. చివరికి ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి.. స్కూలు యాజమాన్యానికి తెలియజేశారు. ఆ తర్వాత చంద్రశేఖర్ ని చితక్కొట్టి, పోలీసులకు అప్పగించారు.

English summary

PET harassed second class school girl