'బాహుబలి -2' కోసం పులికి ట్రైనింగ్!!

Peter Hein giving training to tiger for Baahubali 2

01:21 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Peter Hein giving training to tiger for Baahubali 2

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతో రాజమౌళి దేశవ్యాప్తంగా గుర్తింపును పొందిన విషయం తెలిసిందే. రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి -2 ద కంక్లూషన్' చిత్రీకరణ పై దృష్టి పెట్టాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసిన అనంతరం మరో షెడ్యూల్ కోసం కేరళ వెళ్లారు. అయితే రాజమౌళి బాహుబలి మొదటి భాగం కంటే గ్రాఫిక్స్ ఇంకా బాగా రావాలని ప్రతీ సన్నివేశం పై దృష్టి పెడుతున్నాడట.

అందుకే ప్రతీ డిపార్ట్‌మెంట్ లో ఒక మైన్ హెడ్ ని నియమించాడట. బాహుబలి -2 లో ఒక ముఖ్య సన్నివేశం కోసం పులి కావాలట. రాజమౌళి ఆ పులిని గ్రాఫిక్ లో తీసేయ్యాలని అనుకున్నాడట. అయితే ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్ గా పని చేస్తున్న పీటర్ హైన్ మాత్రం రియల్ పులిని వాడదామని రాజమౌళి తో చెప్పాడట. అందుకోసం పీటర్ హైన్ ఒక పెద్ద పులికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడట. బాహుబలి కంటే బాహుబలి -2 కి ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ అవ్వాలనే ఇలా చిత్రీకరిస్తున్నారని సమాచారం.

English summary

Stunt Master Peter Hein giving training to tiger for Baahubali 2 movie. For an important scene Peter Hein want to use a real tiger in movie. So he is giving a training to Tiger that how to act or behave.