మోడీ పై 'పాక్' కోర్టులో పిటీషన్ 

Petetion On Modi In Pakistan Court

06:32 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Petetion On Modi In Pakistan Court

భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్‌లోని లాహోర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇంతకీ ఆయన చేసిందేమంటే, ఇటీవల మోడీ పాకిస్తాన్ లో ఆకస్మికంగా పర్యటించడమే. అధికారిక అనుమతి లేకుండా నరేంద్ర మోదీ డిసెంబరు 25న 120 మంది ప్రతినిధులతో కలిసి పాకిస్థాన్‌ వచ్చారంటూ , మునీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. మోదీ డిసెంబరు 25న రష్యా నుంచి అఫ్గానీస్తాన్ అక్కడ నుంచి ఆకస్మికంగా పాకిస్తాన్ చేరుకొని, లాహోర్‌లోని పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నివాసంలో ఇద్దరు ప్రధానులు దాదాపు గంటన్నరసేపు సమావేశమయ్యారు. ఆతర్వాత ఇండియా కు మోడీ చేరుకున్నారు. ఇది సంచలనం అయింది. భారత్ లో వివిధ పక్షాలు కూడా మిశ్రమ స్పందన వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. దీనిపై ఇప్పుడు పాక్ లో పిటీషన్ దాఖలవడం గమనార్హం.

English summary

A person named Muneer Ahmed who belongs to pakistan was filed a case on Indian Prime Minister Narendra modi for his sudden visit of pakistan