పెట్రోల్.. హోమ్ డెలీవరీ..

Petrol Home Delivery Service

10:44 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Petrol Home Delivery Service

ఇకపై పెట్రోల్ కొట్టించుకోవడానికి మనం పెట్రోల్ బంకుకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన పనిలేదు. మన వాహనం ఎక్కడుంటే అక్కడికే పెట్రోల్ తెచ్చే కొత్త విధానం అమలులోకి వచ్చింది. అయితే ఇది ఇండియాలో కాదు లెండి. అమెరికాలో. ప్రస్తుతం కొత్త ఆలోచనలు ప్రపంచ గమనాన్నే మార్చేస్తున్నాయి. సరికొత్త ఆవిష్కరణలు, వినూత్న ప్రయత్నాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నో కొత్త ఆలోచనలతో అనేక స్టార్టప్‌ కంపెనీలు దూసుకు వస్తున్నాయి. అమెరికాలో స్టార్టప్‌లకు పుట్టినిల్లుగా నిలిచిన సిలికాన్‌ వ్యాలీ ప్రాంతంలో వుయ్‌ ఫ్యుయల్‌ పేరుతో ఓ స్టార్టప్‌ ప్రారంభమైంది. వాహనదారులు తరచూ పెట్రోలు కొట్టించుకోవడానికి బంక్‌ కెళ్లక్కరలేకుండా వాహనం ఎక్కడుంటే అక్కడికే పెట్రోల్‌ తెచ్చిస్తారు వీరు. మొబైల్‌ యాప్‌ ద్వారా ఇంధనం అయిపోయిందని చెప్తే అరగంటలో వాహనం దగ్గరికే వచ్చి ఇంధనం నింపుతారు. మొబైల్‌ యాప్‌ ద్వారా మాత్రమే ఈ సర్వీసును వినియోగించుకోవచ్చు. ఎక్కడైనా ప్రయాణం మధ్యలో ఉన్నట్టుండి ఇంధనం అయిపోయిన వారికి ఇలాంటి సదుపాయం చాలా ఉపయోగకరం. అలాగే ప్రయాణం మొదలెట్టకముందే కారు పార్కింగ్‌లో ఉండగానే కావాల్సినంత ఇంధనం ఫిల్‌ చేయించి పెట్టుకోవచ్చు. అయితే ఇంధనం ధరతో పాటు సేవల నిమిత్తం ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా తీసుకొని ఇంధనం ఫిల్‌ చేయించుకోవచ్చు. ప్రస్తుతం ఈ సర్వీసు పాలో ఆల్టో, మెన్లో పార్క్‌ ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

English summary

A new service started in Silicon valley named WeFuel.With the use of this service we can get fuel at our desired location by without going to filling station