సాగర తీరాన పెట్రో వర్సిటీ

Petroleum University In Visakhapatnam

07:13 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Petroleum University In Visakhapatnam

విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటు కాబోతోంది. ఈమేరకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఆంధ్రా యూనివర్శిటీతో కేంద్ర పెట్రోలియం శాఖ మూడేళ్లపాటు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈనెల 4వ తేదీన ఆంధ్రా యూనివర్శిటీతో పెట్రోలియం వర్శిటీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా పెట్రోలియం వర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించి, ఈ ఏడాదిలోనే తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరిపాలన ఇలా అన్ని ప్రక్రియలు మూడేళ్ల పాటు ఏయూ నుంచే నిర్వహించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెల్పింది. మూడు సంవత్సరాల్లో వర్శిటీకి సంబంధించి సొంత భవనాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని అక్కడికి తరలిస్తామని పెట్రోలియం శాఖ చెబుతోంది. గతంలో రాజమహేంద్రవరంలో పెట్రో యూనివర్సిటీ ప్రపాదన వచ్చినా వెన్నక్కి పోయింది. ఇప్పుడు సాగర తీరాన ఏర్పడుతోంది.

English summary

Central Government has sanctioned Petroleum University to Andhra Pradesh In Vishakapatnam.This petroleum university to start in this year .Previously this petroleum university was sanctioned to Rajahmundry and later and it was finally opened in Vishakapatnam Andhra University Campus