ఆపదలో కాపాడే పానిక్ బటన్..

Phone Button That Protects Women

06:50 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Phone Button That Protects Women

ఆపదలో చిక్కుకున్న మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు వీలుగా అన్ని మొబైల్ ఫోన్లలో ఒకేరకమైన అలారం బటన్ అందుబాటులోకి రానుంది. మొబైల్స్ లో దీనిని ఏర్పాటు చేసేందుకు సెల్‌ ఫోన్ కంపెనీలు అంగీకరించాయని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ సౌకర్యం వచ్చే ఏడాది మార్చి నుంచి అమలులోకి రానుంది. టెలీ కమ్యూనికేషన్‌ శాఖ దీనిని తప్పనిసరి నిబంధనగా చేస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. దీనికి అధునాతన సాంకేతిక టెక్నాలజీని జోడించాల్సి ఉంది. మహిళా భద్రతా సమస్యలపై ఇప్పటికే పలుమార్లు చర్చించాక మొబైల్ కంపెనీ పానిక్ బటన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపాయి. ఈ సౌకర్యం ఆపదలో ఉన్న మహిళ పానిక్ బటన్ నొక్కగానే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందుతుంది. వెంటనే వారు అక్కడికి చేరుకుని సహాయం అందించేందుకు అవకాశం ఉంటుంది.

English summary

By pressing of finger on their phone as Union Minister Maneka Gandhi has managed to get mobile phone companies on board for providing panic button in handsets by March next year that will send emergency alerts.