ఫోన్‌ కేసే ప్రింటర్..!

Phone case prints vintage-style photos

09:37 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Phone case prints vintage-style photos

ప్రస్తుతం మొబైల్ ఫోన్ నిత్యావసరమైపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే మనం ఊరుకుంటామా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫొటోలు దిగుతాం.. భద్రంగా దాచుకుంటాం. ఎంతో నచ్చిన ఫోటోలను సత్వరమే ప్రింట్ తీసుకోవడానికి లేక కాస్త నిరుత్సాహం చెందుతాం. అయితే ఇప్పుడా ఇబ్బంది లేదు. సెల్‌ ఫోన్‌ కేస్‌ తోనే మీకు కావాల్సిన ఫొటోలను ప్రింట్‌ తీసుకోవచ్చు. సెల్‌ఫోన్‌లోని ఫొటోలను ప్రింట్‌ తీసుకునేందుకు వీలుగా ఫ్రాన్స్‌కి చెందిన ప్రింట్‌ అనే స్టార్టప్‌ కంపెనీ ఈ ఫోన్‌ కేసుని రూపొందించింది. ఇది పోలరాయిడ్‌లా పనిచేస్తుందని కంపెనీ చెపుతోంది. ఈ కేస్‌ని ఐఫోన్‌ 6ఎస్‌, 6, 5ఎస్‌, 5సీ, 5.. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌5, ఎస్‌4 ఫోన్లకు అమర్చుకోవచ్చని తెలిపింది. దీని ధర 150 డాలర్లు. దీనిలో థర్మల్‌పవర్‌ టెక్నాలజీ ఉంటుందని.. ఇంక్‌ అవసరంకూడా లేదట. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తమ సెల్‌ఫోన్‌లో వందల కొద్ది ఫొటోస్‌ దిగుతున్నారని కాకపోతే.. వాటిని తిరిగి చూసుకోవడం లేదని ప్రింట్‌ స్టార్టప్‌ కంపెనీ వ్యవస్థాపకుడు క్లెమెంట్‌ పెర్రట్‌ తెలిపారు. అందు కోసమే ఈ కేసుని తయారు చేశామని.. దీని సహాయంతో వెంటనే ప్రింట్‌ తీసుకొని ఫొటోలను చూసుకోవచ్చని.. స్నేహితులకు, బంధువులకు ఇవ్వవచ్చని చెప్పారు.

English summary

Prynt case is a phone case that instantly prints your iPhone pictures like an old-fashioned Polaroid.No extra ink is needed to print – you just bust it out the box and go. And once you’ve taken your pics, you can filter them, add stickers or edit – then press print.