ఫొటో లుక్‌ మార్చే 'ఫొటోఫై'..

Photo Fi Changes The Look Of Your Photo

04:10 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Photo Fi Changes The Look Of Your Photo

ఫొటో ఫై. ఆండ్రాయిడ్ యూజర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైన మరో యాప్ ఇది. దీని సహాయంతో ఆండ్రాయిడ్ వినియోగదారులు ఇప్పుడు తమ ఫొటోలకు మరింత 'అట్రాక్టివ్ లుక్‌'ను ఇవ్వవచ్చు. 'ఫొటో ఫై ఫొటో ఎడిటింగ్ కాలేజ్’ పేరిట గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. ఈ యాప్ లో ఎన్నో స్పెషాలిటీలు ఉన్నాయి. మనం తీసిన ఫొటో లుక్ ను పూర్తిగా మార్చేందుకు ఇది యూజ్ అవుతుంది. ముఖ్యంగా కాలేజీ యుతను టార్గెట్ గా చేసుకుని ఈ యాప్ ను రూపొందించారు. యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఎన్నో కొత్త ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

ఇందులో ఫొటోలకు కావల్సిన వివిధ రకాల ఫిల్టర్లు, లైట్ ఎఫెక్ట్‌లు, ఫొటో మిర్రర్, 90కు పైగా ఫాంట్లు, 70కి పైగా లే అవుట్లు, 40వేలకు పైగా గ్రాఫిక్ ఎలిమెంట్లు, 30కి పైగా బ్యాక్‌గ్రౌండ్ ప్యాట్రన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా యూజర్లు తమ ఫొటోలకు మరిన్ని హంగులను కల్పించవచ్చు. దీంతోపాటు టిల్ట్, రొటేట్, రిఫ్లెక్ట్, లైట్ ఎఫ్‌ఎక్స్, బ్లర్, షార్పెన్, ఇన్‌స్టా స్కేర్, వాటర్ మార్క్, టెక్ట్స్ ఓవర్‌లే, ఆర్ట్ వర్క్, స్టిక్కర్స్, ఫ్రేమ్స్, మెమె, షేప్ మాస్క్, స్టాక్ ఫొటోగ్రఫీ వంటి అనేక ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ యాప్ పై మీరు ఓ లుక్ వేయండి. ఛాన్స్ ఉంటే ఒకసారి యూజ్ చేసి దీని స్పెషాలిటీలు ఎంటో స్వయంగా తెలుసుకోండి.

English summary

A new smart phone application named Photo Fi which is used to add effects to the photos. There were soo many features in this app. Photo Mirror effect,light photo, and many more are there in this app