కనువిందు చేసిన గ్రహణం

Pictures of solar eclipse

05:43 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Pictures of solar eclipse

ఇండోనేషియాలో బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా పగలే వెన్నెలా అనిపించే విధంగా అసాధారణదృశ్యం చోటుచేసుకుంది. అక్కడి ప్రజలు ఆనందాశ్చర్యాలతో పులకించిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం ఇండోనేషియాలో ఆరు గంటల 19 నిముషాల నుంచి గ్రహణం మొదలైంది. చంద్రుడు పూర్తిగా సూర్యుడ్ని మూసేయడంతో కొంతసేపు పగలే రాత్రిగా మారిపోయింది. అక్కడ ఇండోనేషియా లోని బెలిటుంగ్ ప్రావిన్స్‌లో ఈ అద్భుతాన్ని వేలాది మంది తిలకించి పులకించి పోయారు. అలాగే సెంట్రల్‌ పసిఫిక్‌ దేశాల్లో కూడా సంపూర్ణ సూర్యగ్రహణం చోటు చేసుకుంది. అదేవిధంగా ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో పాక్షికంగా గ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణాన్ని చూడడానికి వివిధ దేశాల నుండి వందలాది మంది ఇండోనేషియా చేరుకున్నారు. ఇక్కడికి విచ్చేసిన టూరిస్టులు మ్యూజికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఫీల్‌ అయ్యారు. సుమత్రా, బోర్నియా వంటి చోట్ల గ్రహణం నాలుగు గంటల పాటు కనువిందు కావడం విశేషం. ఇండోనేషియాలోనే కాక వివిధ దేశాలలో గ్రహణం ఎలా కనువిందు చేసిందో తెలుసుకోవాలంటే స్లైడ్‌ షో చూడాల్సిందే.

1/9 Pages

సంపూర్ణ సూర్యగ్రహణం

సూర్యుడ్ని పూర్తిగా మూసేసిన చంద్రుడు ఈ దృశ్యం ఇండోనేషియాలో చోటుచేసుకుంది. చూడడానికి అద్భుతంగా ఉంది కదా.. ఈ దృశ్యం. మనకే ఇలా ఉంటే చూసిన వాళ్ళు మైమరచిపోయి ఉంటారు.

English summary

In this article we have listed about amazing pictures of solar eclipse. It is the only one of the year. India will get to see only the 12% and that too in Hyderabad. It will last for about 7 hours and 27 minutes as per the estimated data and will be seen in Hyderabad between 6:29 am to 6:47 am Wednesday.