నిరోధ్ లో సెల్... జైల్లోకి పావురంతో రవాణా ...

Pigeon caught outside prison with mobile phone in colombia jail

10:49 AM ON 7th September, 2016 By Mirchi Vilas

Pigeon caught outside prison with mobile phone in colombia jail

లొసుగులు ఉంటే, ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. అది జైలైనా, మరొకటి అయినా అంతే. జైలుగోడల్ని ఎంతో బందోబస్తుగా నిర్మించి..చుట్టూ కరెంట్ ఫెన్సింగ్ పెట్టి ఖైదీలను కట్టడిచేస్తున్నా జరిగే వ్యవహారాలు ఏమాత్రం ఆగడం లేదు. అలా అలా జరిగిపోతూనే ఉన్నాయి. నిరంతర పహారా ఉన్నా కరుడుగట్టిన ఖైదీలు తమ దందాలు జైలు నాలుగుగోడల మధ్య నుంచే నడిపేస్తున్నారు. యధేచ్ఛగా సెల్ ఫోన్లు వాడుతూ జనానికి థమ్కీలు ఇచ్చేస్తున్నారు.

ఖైదీలకు సెల్ ఫోన్లు ఎలా అందుతున్నాయంటే దానికి చాలా దారులే ఉన్నాయి. తాజాగా తూర్పు కొలంబియాలోని కాంబిటా జైలులో కంటపడ్డ సీన్ పోలీసుల్ని ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. జైలులోని ఓ ఖైదీకి సాయం చేసేందుకు ఓ పావురం ఎగిరొచ్చింది.

వీపుపై నిరోధ్ లో ప్యాక్ చేసిన ఓ మొబైల్ ఫోన్.. అందులో ఓ పెన్ డ్రైవ్ మోసుకొచ్చింది. ఆ పావురం వీపునకు కట్టి పంపించిన తీరుతో పోలీస్ లకు మైండ్ బ్లాంక్ అయింది. పావురానికి అమర్చిన ఆ ప్యాక్ ను తొలగించి అనంతరం దానిని పోలీసులు గాల్లోకి విడిచిపెట్టారు. ఇంతకీ ఆ పావురం ఎవరికోసం సెల్ ఫోన్ తీసుకొచ్చింది..దీనిని పంపించిందెవరు అనే దానిపై కాంబిటా ప్రిజన్ సిబ్బంది కూపీలాగుతున్నారు. సాధారణంగా పావురాలతో ప్రేమ సందేశాలు, ఇక రాజుల కాలంలో రాయబారాలు నడిచేవి. ఇప్పుడు రవాణా కు వాడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:యు.పిలో ఓటేస్తే, స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తారట ...

ఇవి కూడా చదవండి:ఛీ ఛీ ... ఆ ఎంపీ కాల్ బాయ్స్ తో రాసలీలలు

English summary

A Pigeon in Colombia Jail caught with a cell phone and a pendrive which was packed in condom and it was fixed to the pigeon. Colombia police were investigating about this pigeon and to whom that pigeon brought cell phone and pendrive.