పావురాలు క్యాన్సర్‌ని గుర్తించగలవట

Pigeons can detect cancers

04:43 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Pigeons can detect cancers

మానవులకు కూడా లేని అసాధారణ లక్షణాలను ఈ భూమిపైన కొన్ని జీవులు కలిగి ఉండడం మనకు తెలిసిందే. మానవ మేధోసంపత్తికి కూడా అందని ఎన్నో పనులను కొన్ని జీవులు చేయగలుగుతాయి. పావురాలు కూడా అలాంటి అసాధారణమైన దృష్టిని కలిగి ఉన్న విషయాన్ని శాస్త్రవేత్తలు నిరూపించారు. తమ అసాధారణమైన చూపును ఉపయోగించి పావురాలు నిపుణులైన వైద్యులకు సైతం కష్టసాధ్యమయ్యే కేన్సర్‌ పరీక్షల రిపోర్టులను అవి చిటికెలో విశ్లేషించగలవు అట.

మహిళల్లో సాధారణంగా వచ్చే వక్షోజాల కేన్సర్‌ను పరీక్షించేందుకు వైద్యులు మామోగ్రామ్‌ అనే ప్రత్యేక ఎక్స్‌రే విధానాన్ని పాటిస్తారు. ఈ విధానంలో ఎక్స్‌రేపై వచ్చే రంగుల ఆధారంగా కేన్సర్‌ వ్యాధిని నిర్ధారించుకుంటారు. సరిగ్గా ఇక్కడే వైద్యులు పావురాల సాయం తీసుకుంటున్నారు.

ఒక లాబ్‌లో పావురాల గుంపుకు కొన్ని ఎక్స్‌రే చిత్రాలను టచ్‌ స్క్రీన్‌పై ఉంచి వాటిపై ఉన్న ప్రత్యేకమైన రంగులపై ముక్కుతో పొడిచేలా శిక్షణ ఇచ్చారు. గుంపులోని ఏ పావురం అయితే ఖచ్చితంగా ఎక్స్‌రేను విశ్లేషించ గలుగుతుందో వాటికి ధాన్యపుగింజలను బోనస్‌గా ఇచ్చారు. దీంతో పావురాలు ఆహారంకోసం మరింత ఖచ్చితత్వంతో ఎక్స్‌రే చిత్రాలపై తమ ముక్కుతో తాకడం మొదలు పెట్టాయి. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి అన్ని పావురాలు కూడా ఒక వైద్యుని స్థాయిలో కేన్సర్‌ ఎక్స్‌రేలను అత్యంత ఖచ్చితంగా విశ్లేషించాయి. పావురాలకున్న అసాధారణమైన రంగులను గుర్తించగలిగే లక్షణం కారణంగానే పావురాలు ఈ పరీక్షల్లో విజయం అయినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary

Pigeons can detect cancers