ఇక మగవాళ్లకి కూడా ఆ పిల్స్ వచ్చేశాయి!

Pill tablets for men

10:43 AM ON 25th October, 2016 By Mirchi Vilas

Pill tablets for men

శాస్త్రసాంకేతికరంగాల నూతన ఆవిష్కరణలతో మానవుడు రోజురోజుకూ తన సహజత్వాన్ని కోల్పొతున్నాడు. గర్భనిరోధానికి ఆడవారు, మగవారూ పడేపాట్లకు శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ టాబ్లెట్ కొంత ఉపశమనాన్ని కలిగించబోతోందని అంటున్నారు. మగవారి శరీరంలో శుక్రకణాల చలనాన్ని(కదిలికను) కొంతకాలంపాటు నిస్సత్తువుగా ఉంచే ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. కొత్తగా తయారు చేసిన ఈ కాంపౌండ్ కి సెల్-పెనెట్రెటింగ్ పెప్టైడ్గా పేరు పెట్టారు. కొత్తగా రూపొందించిన ఈ టాబ్లెట్లతో గర్భాన్ని నిరోధించడంలో ఆడవారికి మగవారు సహకరించవచ్చు.

ఈ ఆవిష్కరణతో మానవజీవితంలో అనూహ్యమైన మార్పులు రావడం ఖాయమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇంతకాలం గర్భాన్ని నిరోధించడానికి కేవలం ఆడవారు మాత్రమే కొన్ని రకాల టాబ్లెట్లను ఉపయోగిస్తూ వచ్చారు. దీంతో ఆడవారికి టాబ్లెట్ల బాధలు తీరినట్లేనని శాస్త్రవేత్తలు తేల్చేశారు. ఓల్వర్ హంప్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ హాల్ మాట్లాడుతూ టాబ్లెట్లు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని తెలిపారు. అంతేకాదు శుక్రకణా ఉత్పత్తి కావాలనుకుంటే కొన్ని నిమిషాలలోనే ఉత్పత్తి జరిగేలా పనిచేసే టాబ్లెట్ తయారు చేశామని తెలిపారు.

1/4 Pages

1. ఈ టాబ్లెట్లకు సంబంధించిన మరికొన్ని విశేషాలను పరిశీలిస్తే, సెక్స్ లో పాల్గొవడానికి కొన్ని నిమిషాలు/గంటలు మగవారు ఈ టాబ్లెట్స్ తీసుకోవాలి.

English summary

Pill tablets for men