పైలట్‌ను ఇరకాటంలో పెట్టిన ఇమ్రాన్‌ మాజీ భార్య

Pilot Faced Problem By Allowing Imran Khan's Ex-Wife Into Cockpit

04:29 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Pilot Faced Problem By Allowing Imran Khan's Ex-Wife Into Cockpit

మాజీ పాకిస్ధాన్‌ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్ధాన్‌ రాజకీయల్లో తనదైన ముద్ర వేశాడు. తాజాగా ఇమ్రాన్‌ మాజీ భార్య రెహమ్‌ఖాన్‌ ఒక వివాదంలో చిక్కుకుంది.

వివరాల్లోకి వెళ్తే ఇమ్రాన్‌ మాజీ భార్య రెహమ్‌ఖాన్‌ పాకిస్ధాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పిఐఎ)కు చెందిన విమానంలో లండన్‌ నుండి పాకిస్తాన్‌ లోని లాహొర్ కు బయలుదేరింది. విమానంలో ప్రయణిస్తున్న రెహమ్‌ఖాన్‌ విమాన పైలట్‌ను కొద్ది సేవు తనను విమానం కాక్‌పిట్‌ లో కూర్చోవడానికి అనుమతి అడగగా ప్రముఖవ్యక్తి కావడంతో సరేనన్న పైలట్‌ కాక్‌పిట్‌ లోకి అనుమతించాడు.

ఇంత వరకు బాగానే ఉంది కాని, ఈ విషయం తెలుసుకున్న ఎయిర్‌ పోర్టు అధికారులు క్రమశిక్షణ చర్యగా భావిస్తూ పైలట్‌ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్‌ ఇంటర్నేనల్‌ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ రెహమ్‌ఖాన్‌ ఎంతటి ప్రముఖ వ్యక్తి అయినా సరైన అనుమతి లేనిదే విమాన కాక్‌పిట్‌లోని అనుమతించకూడదని, ఇది నిభందన ఉల్లంఘన చర్యగా భావిస్తూ పైలట్‌ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇలా ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భర్య తన సరదాకోసం సదరు విమాన పైలట్‌ను ఇరకాటంలోకి నెట్టింది.

42 ఏళ్ళ రెహమ్‌ఖాన్‌ గతంలో ప్రపంచ ప్రసిద్ది చెందిన బిబిసి న్యూస్‌ ఛానెల్‌ లో టి.వి జర్నలిస్ట్‌గా పనిచేసేది. ఇమ్రాన్‌ఖాన్‌ పెళ్ళి చేసుకున్న తరువాత పాకిస్ధాన్‌ కు వచ్చేసిన రెహమ్‌ ఆ తరువాత వివిధ కారణాల వల్ల ఇమ్రాన్‌ఖాన్‌తో విడాకులు తీసుకుంది. ఇమ్రాన్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తరువాత రెహమ్ ఖాన్ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తుండడం విశేషం.

English summary

Pakistan Ex-Cricketer Imran Khan who became politician. His ex-wife named reham khan asked the aeroplane pilot to allow her to cockpit, though she is a famous person the pilot allowed her to sit in cockpit for few minutes. Later the pilot has faced an legal issues from PIA for allowing her into the cockpit without certain permissions