మొటిమలు ఏం  చెప్తున్నాయి ??

Pimples says about your health

05:02 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Pimples says about your health

ప్రస్తుత కాలం లో అందరూ మొటిమల సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖం లో ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం లో మొటిమలు వస్తాయి అవి మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాయో తెలుసా ? అదేంటి... అవి మీకు ఏం చెప్తాయి అనుకుంటే మీ పోరపాటే. మొటిమలను బట్టి మన ఆరోగ్య పరిస్టిని అంచనావేయవచ్చు అని చైనీస్ నిపుణులు అంటున్నారు. అదెలా అనేది చూద్దాం.

1. నుదురు :

ఇది జీర్ణ వ్యవస్థ గురించిన విషయాలను గురించి తెలియజేస్తుంది. ఇక్కడి మొటిమలు జంక్ ఫుడ్ వల్ల లేదా ఆహారం లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం వలన నుదుటి మీద వస్తాయి. దీనికి పరిష్కారమార్గం నీరు ఎక్కువగా తీసుకోవడం, దోసకాయ వంటి చల్లా దనాన్ని ఇచ్చే పండ్లు తీసుకోవడం మంచిది.

2. కనుబొమ్మల మద్య :

ఇది లివర్ గురించి తెలియజేస్తుంది. ఆహార పదార్దాల వలన వచ్చే అలర్జీ వల్ల కనుబొమ్మల మద్య మొటిమలు వస్తాయి. ఇక్కడ మొటిమలు కలిగిన వారు ఆల్కహాల్ కు , పాల ఉత్పత్తులకు , కొవ్వు పదార్దాలకు దూరంగా ఉండడం మంచిది. వీటి తో పాటు ప్రతి రోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తగినంత సమయం నిద్రపోవడం ద్వారా కాలేయం కూడా విశ్రాంతి చెందుతుంది.

3. కణితలు( కంటి పక్కన ):

కంటి చుట్టూ వచ్చే మొటిమలకు కారణం డీహైడ్రేషన్. అందువల్ల నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇది కిడ్నీగురించిన విషయాలను తెలియజేస్తుంది. కళ్ళ కింద వలయాలు కుడా డీహైడ్రేషన్ వల్ల వస్తాయి.

4. ముక్కు :

ఇది గుండె కి సంబందించిన ఆరోగ్య విషయాలను తెలియజేస్తుంది. ముక్కు పై మొటిమలు కలిగిన వారు రక్త పోటు, విటమిన్ బి స్టాయిలను పరీక్షించు కోవాలి. వీరు కారం , గాటైన ఆహారాలను తినడం తగ్గించుకోవాలి. అలాగే మాంసాహారం తినడం కుడా తగ్గించు కోవడం మంచిది. ఇటువంటి వారు తాజా గాలిని పీల్చుకోవాలి.

5. చెవులు :

ఇది కిడ్నీ గురించిన ఆరోగ్య సమాచారాన్ని తెలియజేస్తుంది. కాఫీ , ఆల్కహాల్ వంటి అలవాట్లవల్ల శరీరం డీహైడ్రేషన్ కి గురి అవుతుంది. అందువల్ల వాటిని తగినంత మీరకు తక్కువగా తాగడమే మంచిది.

6. బుగ్గలమీద :

ఇక్కడ వచ్చే మొటిమలు శ్వాసవ్యవస్థ గురించి తెలియజేస్తాయి. మీరు పొగ తాగుతారా ? లేక అలర్జీ ఉందా ? ఒక వేళ ఈ రెండు ఉన్న వారు లేదా ఏదో ఒక అలవాటు ఉన్నా సరే ఇలా బుగ్గ మీద మొటిమలు రావడానికి అవకాశం ఎక్కువ గా ఉంది అంటున్నారు . ఇటు వంటి వారు శరీరాన్ని అధిక వేడికి గురికాకుండా చూసుకోవాలి. చల్లదన్నాన్ని ఇచ్చే పదార్దాలను మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ అల్కలీన్ కలిగిన ఆహారాన్ని సేవించాలి. మాంసాహారం, పాల ఉత్పత్తులు, ఆల్కహాల్, కెఫీన్ షుగర్ మొదలగు వాటికి దూరం గా ఉండడం మంచిది. అల్కలీన్ కలిగిన కూరగాయలు తీసుకోవాలి. అదే విధంగా మురికిగా ఉన్న దిండు కవర్ల వలన సెల్ ఫోన్ల వలన కుడా మొటిమల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

7. గడ్డం ఇరు వైపులా :

ఇక్కడి మొటిమలు హార్మోన్ల బాలెన్స్ గురించిన విషయాలను తెలుపుతాయి. ఈ ప్రదేశం లో ముఖ్యం గా వత్తిడి కి లోనవడం వలన , హార్మోనుల మార్పిడి వలన మొటిమలు చోటుచేసుకుంటాయి. వీరు 7 లేదా 8 గంటలు కచ్చితం గా నిద్రించడం మంచిది. అదేవిధంగా ఆకుకూరలు అధికం గా తీసుకోవాలి. శరీరానికి సరిపడినంత నీటిని తాగాలి. ముఖాన్ని ఎప్పటికప్పుడు శుబ్రపరుచుకోవాలి.

8. గడ్డం :

ఇది ఉదర సంబందమైన విషయాలను గురించి తెలియజేస్తుంది. ఈ బాగం లో మొటిమలు కలవారు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.అలాగే హానికారక మరియు మత్తు పానీయాలను తీసుకోవడం మానుకోవాలి. ప్రతి రోజు హెర్బల్ టీ తాగడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

9. మెడ :

ఇక్కడి మొటిమలు అనారోగ్యానికి సూచిక .ఇలాంటి సమస్యలతో ఉన్న వారు యోగా చేయడం , మాద్యాహాన్న వేళలలో కొంచం సేపు నిద్రపోవడం, బాగా గట్టిగా గాలిపీల్చి వదలడం ఇలాంటి ప్రక్రియలు చేయడం వలన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.

చూసారుగా మొటిమలు ఆరోగ్యం గురించి ఏమి చెప్పాయో.

English summary

Pimples says about your health. Spots in different zones correspond to different problems.