కన్నీరు తెప్పించిన టిప్

Pizza Delivery Boy Gets Tears With The Tip

11:58 AM ON 4th December, 2015 By Mirchi Vilas

Pizza Delivery Boy Gets Tears With The Tip

సాధారణంగా మనం ఆర్డర్‌ చేసిన పిజ్జాను తీసుకువచ్చే పిజ్జాడెలివరి బాయ్‌కు ఎంతోకంత టిప్‌ను ఇస్తుంటాం. మనం ఇచ్చిన టిప్‌ను తీసుకుని ఆనందంతో వెళ్ళిపోతుంటారు.కానీ ఒక పిజ్జా డెలివరిబాయ్‌ కి వచ్చిన టిప్‌ను చూసుకుని అతను ఆనంద భాష్పాలతో ఒక వీడియో తీసి ఆన్‌లైన్లో పెట్టాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా హల్‌చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని గియోనినో అనే పిజ్జా సంస్థ ఉద్యోగి జెఫ్‌ లూయిస్‌ తనకు వచ్చిన టిప్‌ను చూసి ఆశ్చర్యపోయాడు.

పిజ్జాడెలివరి బాయ్ లూయిస్‌ ను సదరు సంస్థ రోజూకంటె కాస్త ముందుగా రావాలని చెప్పారు. దీంతో పిజ్జాలు పట్టుకుని డెలివరీ ఇవ్వడానికి ఒక స్థానిక చర్చ్‌ వద్దకు వెళ్ళగా పిజ్జాలను పట్టుకుని ఉన్న లూయిస్‌ను ఒక పిజ్జాను పట్టుకుని, స్టేజ్‌ పై ఉన్న పాస్టర్‌ వద్దకు రమ్మని చెప్పారు. దీంతో కాస్త అయోమయానికి గురైన లూయిస్‌ సంశయిస్తూనే స్టేజ్‌ పైకి వెళ్ళి పిజ్జాను ఇచ్చాడు.

తరువాత ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ చర్చిలో ఉన్నవారంతా కలిసి పిజ్జా డెలివరి బాయ్‌ లూయిస్‌కు ఏకంగా 700 డాలర్ల డబ్బును టిప్‌గా ఇచ్చారు.

దీంతో ఆనందానికి గురైన లూయిస్‌ ఒక వీడియోను తీసి దాన్ని ఆన్ లైన్లో పెట్టాడు . వీడియోలో లూయిస్‌ మాట్లాడుతూ "ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. తాను గత కొద్దికాలంగా కష్టాల్లో ఉన్నాను, నా మునుపటి జీవితాన్ని తిరిగి పొందడానికి ఎంతో పోరాడుతున్నాను" అని లూయిస్‌ తన వీడియోలో కన్నీటి పర్యంతం అయ్యాడు.

చర్చ్‌ పాస్టర్‌ కెన్‌ రైట్‌ మాట్లాడుతూ, నేను లూయిస్‌కు కేవలం 100 డాలర్లను ఇవ్వాలనుకున్నానని ,కాని ఇలా చర్చిలో మిగిలిన వారంతా ముందుకు వచ్చి 700 డాలర్లను ఇవ్వడం యాదృచ్ఛికంగా జరిగిందని అన్నారు.

ఇలా ఆనందంతో లూయిస్‌ పెట్టిన వీడియోను మీరూ ఓసారి చూడండి.

English summary

A pizza delivery boy named Jeff Louis who works in Gionino's Pizzeria has a got tip of 700 dollars. With this tip he gets tears with happiness and he posted a video by showing his happiness