ఫుట్ బాల్ ఆటగాళ్లతో వెళ్తున్న విమానానికి ప్రమాదం.. 5గురు మినహా అందరూ మృతి!

Plane crash in Colombia

12:59 PM ON 30th November, 2016 By Mirchi Vilas

Plane crash in Colombia

ఫుట్ బాల్ క్రీడాకారులతో వెళ్తున్న ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బ్రెజిల్ కు చెందిన ఫుట్ బాల్ క్రీడాకారులు సహా 81 మంది ప్రయాణిస్తుండగా కేవలం 5గురు మినహా మిగిలిన వారంతా మృతి చెందారు. బొలివియా నుంచి కొలంబియాలోని మెడిలిన్స్ విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని మెడిలిన్స్ విమానాశ్రయ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 25 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. 81 మంది ప్రయాణికుల్లో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

అయితే మంగళవారం తెల్లవారు జామున కొలంబియా సెంట్రల్ లో భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలను నిలిపివేసినట్లు మెడిలిన్ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

1/6 Pages

కొలంబియాలో జరిగే సౌత్ అమెరికన్ కప్ ఫైనల్స్ లో ఆడేందుకు వెళ్తుండగా ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. లామియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం బ్రెజిల్ లో బయల్దేరి బొలీవియాలోని శాంటాక్రూజ్ లో ఆగింది. అనంతరం అక్కడినుంచి కొంలంబియాకు బయల్దేరి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. కోపా సుదామెరికన్ టోర్నీ ఫైనల్స్ లో భాగంగా అట్లెటికో నసియోనల్ తో బుధవారం జరిగే మ్యాచ్ కోసం బ్రెజిల్ చాపికోయిన్స్ ఫుట్ బాల్ జట్టు విమానంలో బయల్దేరింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.15గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

English summary

Plane crash in Colombia