మేయర్ దంపతుల హత్యకు ఆరు నెలల ముందే ప్రణాళిక 

Plannned Before Six Months To Murder Chittoor Mayor

11:38 AM ON 14th December, 2015 By Mirchi Vilas

Plannned Before Six Months To Murder Chittoor Mayor

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ కటారి అనురాధ , మోహన్ దంపతుల హత్యకేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. వేగవంతంగా సాగుతున్న దర్యాప్తు సత్ఫలితాలు ఇస్తోంది.

మేయర్ దంపతుల హత్యకు పక్కా ప్రణాళిక ముందే సిద్ధం అయింది. అది కూడా ఆరునెలల ముందే. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేటతెల్లం అయింది. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఆరునెలల ముందే మేయర్ దంపతుల హత్యకు పధకం వేసిన ప్రధాన నిందితుడు చింటూ , రెండుసార్లు మేయర్ దంపతుల ను హత్యచేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. మూడోసారి అనుకున్నట్టే మట్టుబెట్టాడు. ఈ కేసులో 23 మంది కుట్రదారులు వున్నారు. అయితే చింటూ తో సహా 20 మందిని అరెస్టు చేయగా , మరో ముగ్గిరిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. చింటూ మొబైల్ లో హత్య ప్రణాళిక దృశ్యాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చింటూ అనుచరుడు పరదామం దగ్గర నుంచి వీడియో లాప్ టాప్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాస్ చెప్పారు.

English summary

In police investigation came to know that the chittoor mayor murder case was planned before six months. This was said by chittoor district SP Srinivas to media