ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి

Please delete these apps from your smartphone

05:44 PM ON 5th August, 2016 By Mirchi Vilas

Please delete these apps from your smartphone

ప్రస్తుత కాలంలో అందరూ స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు. ఆ ఫోన్ లో రకరకాల యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు. అయితే అందులో కొన్ని యాప్స్ బాగా ఉపయోగపడేవి ఉంటాయి, ఉపయోగపడనవి ఉంటాయి. కొన్ని ఉపయోగపడేవే అయినా వాటితో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ క్ర‌మంలో హ్యాక‌ర్లు కూడా ప‌లు యాప్స్‌ ను తయారు చేస్తూ అందిన కాడికి వినియోగ‌దారుల స‌మాచారాన్ని త‌స్క‌రించ‌డం మొద‌లు పెట్టారు. ఒక్కో సంద‌ర్భంలో కొంద‌రు డ‌బ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా గూగుల్ కూడా త‌న ప్లే స్టోర్‌ లో ఉన్న యాప్స్ అన్నింటినీ చెక్ చేయ‌డం లేదు.

దీంతో యూజర్లు త‌మంత‌ట తామే ఏ యాప్ ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. అయితే కొన్ని యాప్స్ కూడా స‌రిగ్గా పైన చెప్పిన హ్యాకింగ్ త‌ర‌హాకు చెందిన‌వే. ఈ యాప్స్ గ‌న‌క మీ ఫోన్‌ లో ఉంటే వెంట‌నే డిలీట్ చేసేయండి. ఆ యాప్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. 

1/8 Pages

యూసీ బ్రౌజర్: (UC Browser)


వేగవంత‌మైన ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ గా ఈ యాప్ ఎంతో గుర్తింపు పొందింది. ఇంటర్నెట్‌ ను వేగంగా బ్రౌజ్ చేసేందుకు ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. కాక‌పోతే అలా చేసే క్ర‌మంలో ఇంట‌ర్నెట్ స్పీడ్‌ నంతా కంప్రెస్ చేస్తుంది. దీంతో ఇత‌ర యాప్‌ ల‌కు ఆటంకం క‌లుగుతుంది. కాబ‌ట్టి ఈ యాప్‌ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి.

English summary

Please delete these apps from your smartphone