ప్లీజ్ నా సినిమా చూడొద్దు

Please Dont See My Movie

10:13 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Please Dont See My Movie

సినిమాలో ఏమైనా అంశాలు నచ్చకపోయినా.. తమ మనోభావాలను కించపరిచేలా ఉన్నా సినిమా ఆపేయాలని డిమాండ్లు రావడం మనకు తెలిసిందే. కానీ తాను హీరోగా నటించిన సినిమానే చూడొద్దని అంటున్నాడు ఓ హాలీవుడ్ నటుడు. టైటానిక్ చిత్రంలో భారతీయులకు సుపరిచితుడైన నటుడు లియోనార్డో డికాప్రియా. ఈయన నటించిన చిత్రమే డాన్స్‌ ప్లమ్‌. 1995లోనే ఈ చిత్రం పూర్తయ్యింది. దీని నిర్మాత డేల్‌ వీట్లీ. దీన్ని ఈ మధ్యనే ఆయన ఇంటర్నెట్‌లో ఉచితంగా ప్రదర్శనపెట్టాడు. అయితే ఆ చిత్రం ఏ మాత్రం బాగాలేదని భావించిన లియోనార్డో, ఆయనతోబాటు చిత్రంలో నటించిన టోబే మెగ్త్వెర్‌లు అప్పట్లోనే కోర్టుకు వెళ్లి, దాని విడుదలను నిలుపుదల చేయించారు. ఇండిపెండెంట్‌ నిర్మాతగా తాను తీసిన చిత్రం గురించి ప్రచారం చేసుకోవడానికి తాను ఈ చిత్రాన్ని ఇంటర్నెట్‌లో ఉంచానని డేల్‌ చెప్తున్నా వినకుండా, లియోనార్డో, ఈసారి ఇంటర్నెట్‌ వారికి నోటీసులు ఇచ్చి, కొన్ని గంటల వ్యవధిలోనే సినిమా ప్రదర్శనను నిలిపివేయించాడు.

English summary

Hollywood Hero Leonardo DiCaprio who was acted as hero in the film Titanic was says that not see his moive.Previously in 1995 a movie named 'Don's Plum' was completed and that movie was not released because of the output of the movie.Recently this movie producer released this movie on online and then Leonardo DiCaprio says that not watch his movie