జూన్ 2న ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్న చంద్రబాబు

Pledge For Nava Nirmana Deeksha

02:51 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Pledge For Nava Nirmana Deeksha

జూన్ 2న రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ నవ నిర్మాణదీక్ష ప్రతిజ్ఞ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఉన్నా ప్రతిజ్ఞ చేయాలన్నారు. అశాస్త్రీయ విభజన, రాష్ట్రంపై దాని ప్రభావం, ఇబ్బందులపై జూన్ 3న సదస్సు జరుగుతుందని వివరించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలు, ప్రభుత్వ సమష్టిగా సాధించిన విజయాలపై జూన్ 4న, రాజధాని భూ సమీకరణ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం పై సదస్సులో చర్చిస్తారు. అంతేకాకుండా నిరంతర విద్యుత్ సరఫరా, సీఐఐ భాగస్వామ్య సదస్సు, ఫైబర్గ్రిడ్ అంశం, పారదర్శకంగా పింఛన్లు, ప్రజా పంపిణీ, పలు విజయాలపై ఈ సందర్భంగా చర్చిస్తారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై జూన్ 5న సదస్సు నిర్వహిస్తారు. పరిశ్రమలు, సేవారంగం, రెగ్యులేటరీ సెక్టారులో ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై జూన్ 6న సదస్సు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి:ఆకాశానికి చిల్లు పడిందా(వీడియో)

ఇవి కూడా చదవండి:జగన్ గురించి జ్యోతుల పురాణం

English summary

Andhra Pradesh Government to Pledge For Nava Nirmana Deeksha on June 2nd in Andhra Pradesh.