జర్నలిస్టులను కాపాడిన ప్రధాని (వీడియో )

PM Modi Saves Photojournalists And Cameraman Life

11:40 AM ON 31st August, 2016 By Mirchi Vilas

PM Modi Saves Photojournalists And Cameraman Life

మన ప్రధాని నరేంద్రమోడీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఓ కెమెరామన్, ఫోటో జర్నలిస్టులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, ప్రధాని గుజరాత్ పర్యటనలోభాగంగా సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ పథకం కింద ఆజి-3 డ్యామ్ను ప్రారంభించారు. డ్యామ్ స్విచ్ ఆన్ చేసి అనంతరం నీటి విడుదలను గమనించారు. అదే సమయంలో దిగువ ప్రాంతంలో ఫొటోలు తీస్తున్న ఫొటోగ్రాఫర్లు, వీడియో చిత్రీకరిస్తున్న కెమెరామన్ని ఆయన గుర్తించారు.

వెంటనే అప్రమత్తమైన మోడీ, చప్పట్లు కొట్టి వారికి ఇండికేషన్ ఇచ్చారు. అక్కడి నుంచి తప్పుకోమని చేతలూపారు. ఈ ప్రమాదాన్ని గమనించిన వెంటనే వీడియో, ఫోటోగ్రాఫర్లు అక్కడినుంచి బయటపడ్డారు. ఓ కెమెరా మెన్ అయితే కెమెరా అక్కడ వదిలి, పరుగు తీసాడు. ప్రధాని సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల డ్యామ్ వద్ద పెద్ద ప్రమాదం తప్పిందని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ అన్నారు.

ఇది కూడా చూడండి: బాలుడిని రేప్ చేసిన మహిళ.. అది వీడియో తీసి.. ఆపై..

ఇది కూడా చూడండి: ఆడపిల్ల పుట్టిందని టవల్ లో చుట్టేసి.. వదిలి వెళ్లిపోయారు

English summary

Media Persons Were In Danger At Dam PM Modi Saves Photojournalists And Cameraman Life.