చిన్నారికి ప్రధాని మోడీ రాసిన లేఖలో ఏముంది?

PM Narendra Modi wrote a letter to Vaishali

11:22 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

PM Narendra Modi wrote a letter to Vaishali

భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రజా సంబంధాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు. చిన్న చిన్న సమస్యలకు కూడా నేరుగా ప్రధాని కార్యాలయం స్పందించేలా చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఓ సంఘటన జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర పుణెలోని రాయ్ గడ్ కాలనీలో ఒక చిన్న గదిలో తన తండ్రి, మేనమామ, అమ్మమ్మతో కలిసి నివసిస్తున్న చిన్నారి వైశాలి యాదవ్.. గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండేది. అయితే, తన బాధను వెల్లడిస్తూ వైశాలి రాసిన లేఖకు స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ఆ చిన్నారికి గత వారం హార్ట్ సర్జరీ చేయించింది.

ఆ సర్జరీ సక్సెస్ అవడంతో చిన్నారి కుటుంబం ఆనందానికి అవధుల్లేవ్. అయితే, తనకు సర్జరీ చేయించమని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి తన మొదటి లేఖలో కోరిన వైశాలి.. హార్ట్ సర్జరీ విజయవంతమైన తర్వాత కృతజ్ఞతలు తెలుపుతూ మోడీకి మరో లేఖ రాసింది. ఇదంతా బానే ఉంది. ఆ తర్వాత జరిగిన మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. వైశాలికి ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా లేఖ రాయడం. దీంతో.. వైశాలి, ఆమె కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రధాని మోడీయే స్వయంగా రాసిన ఈ లేఖలో ఆయన సంతకం కూడా ఉండటంతో వారు మరింత ఆశ్చర్య పోయారు.

ఈ సందర్భంగా వైశాలి మేనమామ ప్రతాప్ మాట్లాడుతూ.. చిన్న ఇంట్లో నివసిస్తున్న తమ వంటి వారికి ఒక ప్రధాని లేఖ రాస్తారని ఎవరైనా ఊహించగలరా? మా ఇంటి అడ్రసు తెలుసుకునేందుకు పోస్ట్ మ్యాన్ కూడా కష్ట పడాల్సి వచ్చింది. ఎన్వలప్ పై పీఎంసీల్ ఉండటంతో సరైన సమయానికి ఆ లేఖ మాకు చేరింది అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక మోడీ తనకు లేఖ రాస్తారనే నమ్మకం తనకు ఉందని చిన్నారి వైశాలి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. వైషాలికి ఎంతో ప్రాణప్రదమైన ఆమె గ్రాండ్ మదర్ కూడా ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేసింది. కాగా, ఆ లేఖలో.. దేశం గర్వించే విధంగా ఎదగాలని వైశాలిని ప్రధాని ఆశీర్వదించారు. అదండీ సంగతి.

English summary

PM Narendra Modi wrote a letter to Vaishali