ఐఎస్ఎస్ లకు కేంద్రం రక్షరేకు 

PM Permission Compulsory To Transfer IAS Officers

12:23 PM ON 31st December, 2015 By Mirchi Vilas

PM Permission Compulsory To Transfer IAS Officers

ఆయా రాష్ట్రాలలో పనిచేసే ఐఏఎస్ అధికారులు ఇక స్వేఛ్చ గా పనిచేయడానికి వెసులుబాటు లభిస్తోంది. ఒకవేళ వీళ్ళపై చర్యలు తీసుకోవాలంటే ప్రధాని అనుమతి విధిగా ఉండాల్సిందే. వివరాల్లోకి వెళితే ,

కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులపై రాజకీయ నేతలు ఒత్తిడి చేయకుండా ఉండేందుకు కేంద్రం కొత్త నియమావళి తెచ్చింది. ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఏఎస్‌లను సస్పెండ్‌ చేయాలంటే ప్రధానమంత్రి అనుమతి తీసుకోవాల్సిందేనని నియమావళిలో స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో పనిచేస్తున్న అఖిల భారత సేవా ఉద్యోగులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ల నియమావళిలోనూ ఇందుకు సంబంధించిన మార్పులను పొందుపరిచారు. ఏ రాష్ట్రంలోనైనా ఐఏఎస్‌ అధికారిని సస్పెండ్‌ చేయాలంటే, విధిగా 48 గంటలముందు కేంద్రానికి తెలపాలి.

పక్షం రోజుల్లో అందుకు గల కారణాలతో కూడిన పూర్తి నివేదికను కూడా రాష్ట్రం సమర్పించాలి. ఇక అధికారులను సస్పెండ్‌ చేసే కాలపరిమితిని కూడా 3నుంచి 2నెలలకు తగ్గించారు. సస్పెండ్‌ కాలపరిమితిని 6నెలలపాటు పొడిగించే అవకాశం ఉండగా.. దాన్ని 4 నెలలకు కుదించారు. ఉద్యోగుల్లో అవినీతిని నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్‌ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొంటూ, భయాందోళలకు గురికాకుండా ఉద్యోగి తన విధులు నిర్వహించడానికి ఈ కొత్త నియమావళిని తీసుకువచ్చినట్లు సూచించారు. ఏకపక్ష నిర్ణయంతో సస్పెండ్‌, బదిలీకి గురైన అశోక్‌ ఖేంకా, దుర్గా శక్తి నాగ్‌పాల్‌, కుల్దీప్‌ నారాయణ్‌ లాంటి అధికారులకు ఈ కొత్త నియమావళి రక్ష రేకు లాంటిదే.

English summary